Asianet News TeluguAsianet News Telugu

Covid Cases in Maharashtra:"మహా"లో క‌రోనా కరాళ నృత్యం.. తాజాగా 41,434 కేసులు.. నైట్ కర్ఫ్యూ అమలు

Covid Cases in  Maharashtra: దేశంలో కరోనా త‌న పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 41,434 కేసులు బయటపడ్డాయి. 9,671 మంది కోలుకోగా 13 మంది మృతిచెందారు. ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని యాక్టివ్​ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది.  
 

Maharashtra issues fresh curfew guidelines as Covid cases spike.
Author
Hyderabad, First Published Jan 8, 2022, 11:17 PM IST

Covid Cases in  Maharashtra:  దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. గ‌త కొన్ని నెలలుగా త‌గ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్‌వేవ్‌ రూపంలో దేశంపై పంజా విసురుతోంది. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మ‌రో వైపు క‌రోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురి చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా అటు క‌రోనా.. ఇటు ఒమిక్రాన్ కేసుల్లో మొద‌టి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేల సంఖ్య‌లో కేసుల రావ‌డంతో మహారాష్ట్ర సతమతమవుతోంది. 
  
 24 గంటల్లో 21 శాతం పెరిగాయి. ఇక రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 41,434 కేసులు బయటపడగా... 13 మంది చనిపోయారు. ముంబైలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల్లో మహారాష్ట్రతో ఢిల్లీ పోటీ పడుతుంది. అక్కడ తాజాగా 20,181 కోవిడ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు చనిపోయారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

తాజాగా  మ‌హారాష్ట్ర‌లో 41 వేల 434 కేసులు నమోదయ్యాయి. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలోనే  21 శాతం ఎక్కువ కేసులు న‌మోద‌య్యాయి.  ఇక ఇత‌ర‌ రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 
గ‌డిచిన 24 గంటల స‌మ‌యంలో 13 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో  ముంబాయిలో అత్య‌ధికంగా 20 వేల 318 కరోనా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి.  అదే స‌మ‌యంలో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1009కి చేరింది. 
 
దీంతో మ‌హారాష్ట్ర స‌ర్కార్ అలెర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. ఈ నెల 10 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఫిబ్రవరి 15 వరకూ అక్కడి పాఠశాలలు క్లోజ్ చేయనున్నట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే అక్కడ బస్సుల్లో ప్రయాణించాలని ఆదేశించింది. వేడుకలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మాత్రమే హాజరవ్వాలని సూచించింది. అలాగే కేవ‌లం   50 శాతం ఆక్యూపెన్సీ రేటుతో మాల్స్, థియేటర్స్ నడిపించాల‌ని నిర్ణ‌యించింది.
 
మ‌రోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదవుతున్నాయి. కొత్త 18,802 కేసులు నమోదవ్వగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కర్ణాటకలో 8,906 కొత్త కేసులు వెలుగు చూశాయి. అక్కడ నలుగురు మరణించారు. కేరళలో 5,944 కేసులు నిర్ధారణ అయ్యాయి. కేసుల సంఖ్య తీవ్రమ‌వ్వ‌డంతో  రాష్ట్రాల్లో ఉన్న ఆంక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినతరం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో వైరస్ జనవరి 15 వరకు రాజకీయ, మత, సామాజిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios