మహారాష్ట్రలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మహా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం తెలిపారు. ఉద్యోగాల్లో సైతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నామని.. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామన్నారు.

న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసిందని నవాబ్ గుర్తుచేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగంగా సంకీర్ణ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్దవ్ సర్కార్‌లో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే. 

Also Read:

బిజెపి మాజీ ఎమ్మెల్యేపై రేప్ కేసు: ఫడ్నవీస్ కు సన్నిహితుడని ఆరోపణ

సూపర్ పవరేం కాదు: ట్రంప్ పర్యటనపై ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు