ముంబై: శివసేనకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కలవాలని అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

also read:'మహా' మలుపు: మోడీతో శరద్ పవార్ భేటీ, శివసేన మాట ఇదీ

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని  భావిస్తున్నారు ఈ మేరకు ఈ మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి.

ఈ తరుణంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తును శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  శివసేనకు చెందిన 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.బీజేపీతో  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రెంటికి చెడ్డ రేవడిగా పరిస్థితి మారే అవకాశం ఉందని అసంతృప్త ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విషయాన్ని పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు చెప్పాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు 17 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేను కలుసుకోవాలని  భావిస్తున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోరారు.

బుధవారం నాడు పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్సీపీ  చీఫ్   శరద్ పవార్  భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.బీజేపీ, ఎన్సీపీ మధ్య సంబంధాలు  మెరుగయ్యాయి.ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించాడు. మరునాడే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రధానమంత్రి మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ చీఫ్  శరద్‌పవార్ మోడీతో భేటీ కావడాన్ని శివసేన కూడ సునిశితంగా పరిశీలిస్తోంది. ఈ తరుణంలో 17 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.