న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం నాడు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో భేటీ అయ్యారు.  రేపు మధ్యాహ్నం ప్రభుత్వం ఏర్పాటు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన ప్రకటించింది.

బుధవారం నాడు పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్సీపీ  చీఫ్   శరద్ పవార్  భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.బీజేపీ, ఎన్సీపీ మధ్య సంబంధాలు  మెరుగయ్యాయి.ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం సాగుతోంది.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించాడు. మరునాడే రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రధానమంత్రి మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ చీఫ్  శరద్‌పవార్ మోడీతో భేటీ కావడాన్ని శివసేన కూడ సునిశితంగా పరిశీలిస్తోంది. 

శివసేనకు చెందిన ఎమ్మెల్యేలందరిని కూడ ముంబైకు రావాలని  ఆ పార్టీ ఆదేశించింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు భవిష్యత్తులో రాష్ట్రపతి పదవిని ఇస్తారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత లేదు. 

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై గురువారం నాడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని  శివసేన ప్రకటించిన సమయంలోనే శరద్ పవార్ మోడీతో భేటీ అయ్యారు.40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. రైతుల ఇబ్బందులపైనే చర్చ జరిగినట్టుగా శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఏ పార్టీ కూడ సరైన సమయంలో స్పందించలేదని మహారాష్ట్ర గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు. అయితే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ తరుణంలో ఎన్సీపీ చీప్ శరద్ పవార్ ప్రధాని మోడీతో భేటీ కావడంతో రాజకీయంగా ఊహగానాలు చెలరేగాయి.అయితేఈ ఊహగానాలకు శరద్ పవార్ చెక్ పెట్టారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి తాను చర్చించలేదని తేల్చి చెప్పారు.