మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు పంజాబ్‌కు చెందిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపుల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమృతా ఫడ్నవీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
పంజాబ్‌కు చెందిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పటికే ర్యాపర్ సిద్ధూ మూసేవాలాను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమ టార్గెట్ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అని ప్రకటించింది. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రతను అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు కూడా ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్ర పోలీసుల నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈమెకు అన్ని సమయాల్లో ఇద్దరు సాయుధులైన గార్డులు వెంటే వుంటారు. అంతేకాకుండా అమృతా నివాసంలో 24 గంటలూ ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. దీనికి అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చే వాహనం కూడా అమృతకు కేటాయించారు.
కాగా... ఈ ఏడాది మే 29న మాన్సా జిల్లాలో గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధు ముసేవాలా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆరవ మరియు చివరి షూటర్‌ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత నెలలో మాన్సా కోర్టులో దాఖలు చేసిన 1,850 పేజీల ఛార్జిషీట్‌లో.. కరుడుగట్టిన నేరస్థుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు ప్రధాన కుట్రదారుడని, జగ్గు భగవాన్‌పురియా, లారెన్స్ బిష్ణోయ్, ఇతరులతో కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డాడని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ ముసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు, కేంద్ర సంస్థలతో కలిసి ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు. మూసేవాలాపై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్ షూటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీటన్నింటిని ఈ కేసులో ప్రశ్నిస్తున్నారు.
Also REad:సిద్దూమూసేవాలా హత్య: పోలీస్ కస్టడీ నుండి తప్పించుకున్న టిను, మండిపడ్డ బీజేపీ
అయితే సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లోగా తనకు న్యాయం చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో దేశాన్ని విడిచి వెళ్లిపోతానన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కుమారుడిపై హత్య చేసిన కేసును కూడా ఉపసంహరించుకుంటానని బల్కౌర్ సింగ్ అన్నారు. తన కుమారుడి హత్య జరిగి 5 నెలలు కావొస్తున్నా ఇంత వరకు తమ కుటుంబానికి న్యాయం జరగకపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు చట్టంపై నమ్మకం వుందని.. అందుకే ఇప్పటి వరకు ఎదురుచూశానని బల్కౌర్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు చలనం లేకపోవడం తనకు కోపం తెప్పిస్తుందన్నారు. నవంబర్ 25 వరరకు తనకు న్యాయం చేయాలని ఆయన పంజాబ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత సిద్ధూ హత్యపై విచారణ జరపాల్సిన అవసరం వుండదన్నారు. సిద్ధూకు అండగా నిలిచిన వారిని ఎన్ఐఏ విచారణకు పిలవడం పట్ల బల్కౌర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సిద్ధూ మొబైల్ ఫోన్, పిస్టల్, ఇతర వస్తువులు అన్నీ ఎన్ఐఏ వద్దే వున్నాయని ఆయన ఆరోపించారు . మూసేవాలాకు గ్యాంగ్‌స్టర్లతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
