లాక్‌డౌన్: 21 రోజుల్లో 25 అడుగుల బావిని తవ్విన దంపతులు
కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నారు మహారాష్ట్రకు చెందిన దంపతులు. తమ గ్రామంలో నీటికి ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని బావిని తవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ దంపతులు శ్రమ ఫలించిందింది.
ముంబై: కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నారు మహారాష్ట్రకు చెందిన దంపతులు. తమ గ్రామంలో నీటికి ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని బావిని తవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ దంపతులు శ్రమ ఫలించిందింది. బావిలో నీళ్లు పడ్డాయి. లాక్‌డౌన్ సమయంలో బావిని తవ్విన ఈ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు.
మహారాష్ట్రలోని వాషిమ్ ప్రాంతంలోని కార్ఖేడా గ్రామానికి చెందిన గజనన్ భవన నిర్మాణ కార్మికుడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పడంతో ఏం చేయాలనే విషయమై భార్యాభర్తలు చర్చించుకొన్నారు.
అయితే తమ ప్రాంతంలో నీటికి ఇబ్బందులు ఉంటాయి.దీంతో బావిని తవ్వాలని నిర్ణయించుకొన్నారు. ఈ విషయమై భార్య పుష్పతో గజానన్ చర్చించాడు. ఆమె కూడ అందుకు అంగీకరించింది.
లాక్ డౌన్ మార్చి 23వ తేదీ నుండి ప్రారంభమైంది. లాక్ డౌన్ ప్రారంభమైన రెండో రోజు నుండే బావి తవ్వకాన్ని ప్రారంభించారు గజానన్ దంపతులు. బావి తవ్వడం ప్రారంభానికి ముందు పూజ చేసి బావి తవ్వకాన్ని ప్రారంభించారు.
అయితే స్థానికులు వీరి ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. అయినా కూడ వీరు మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రతి రోజూ కనీసం అడుగు మేర బావిని తవ్వడం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే గజానన్ తనకు సంప్రదాయ పనిముట్లతోనే బావిని తవ్వడం ప్రారంభించారు.ఈ బావి తవ్వకం కోసం ఎలాంటి యంత్రాలను ఉపయోగించలేదు.
21 రోజుల్లో 25 అడుగుల లోతు బావిని తవ్వారు. అయితే ఈ బావిని తవ్విన తర్వాత నీళ్లు రాకపోతే ఏం చేయాలనే విషయమై కూడ వీరు చర్చించారు. ఒకవేళ నీళ్లు పడకపోయినా నీటిని నిల్వ చేసుకొనేందుకు ఈ బావి ఉపయోగపడుతోందని భావించారు.
also read:పంజాబ్‌లో కరోనా రోగుల డ్యాన్స్:సోషల్ మీడియాలో వీడియో వైరల్
15 అడుగులు దాటిన తర్వాత నీటి తడి కన్పించడంతో ఆనందంగా బావిని తవ్వినట్టుగా గజానన్ దంపతులు చెప్పారు. తాము చేస్తున్న పనిలో అలసట తెలియకుండా ఉండేందుకు గాను వీరు పాటలు పాడుతూ బావిని తవ్వారు. బావిలో నీళ్లు రావడంతో స్థానికులు కూడ ఆశ్చర్యపోయారు.