చంఢీఘడ్:కరోనా వైరస్ సోకిన 12 మంది రోగులు టీవీలో వస్తున్న పాటకు ఉల్లాసంగా మంచంపైనే చేతులు ఊపుతూ లయబద్దంగా డ్యాన్స్  చేశారు. ఈ దృశ్యాలను ఓ రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

కరోనా సోకిన 12 మంది రోగులు జలంధర్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోగులు ఉన్న గదిలో ఓ టీవీ కూడ ఉంది. టీవీలో హుషారైన పాట రావడంతో ఈ పాటను చూసిన కరోనా రోగులు మంచంపై కూర్చొని ముఖానికి మాస్కులతో ఆ పాటకు అనుగుణంగా తమ చేతులు, కాళ్లు ఊపుతూ డ్యాన్స్ చేశారు.

also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: రోడ్లపైనే గుంజీలు తీయించిన పోలీసులు

కరోనా సోకిన వీరంతా తమ కష్టాన్ని కాసేపు పక్కనపెట్టి ఆనందంగా డ్యాన్స్ చేయడాన్ని చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు.  కరోనా రోగులు సామాజిక దూరాన్ని పాటిస్తూ డ్యాన్స్ చేయడంపై పలువురు వారిని అభినందించాారు. కరోనా సోకిన రోగులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చేందుకు కూడ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.