భారతదేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర కేసుల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉంది. దీంతో వైరస్‌ను కట్టడి చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కోవిడ్ 19 నియంత్రణ చర్యలను ప్రజలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధించాల్సి వస్తుందంటూ ప్రజలను హెచ్చరించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.

Also Read:రోజుకు 10వేల కేసులు.. మరోసారి లాక్‌డౌన్ అంటూ పుకార్లు, కేంద్రం స్పందన ఇదీ..!!

కరోనా మహమ్మారిపై క్షేత్రస్థాయి పరిస్ధితిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని, సడలింపులు ముప్పుగా పరిణమించాయని వెల్లడైతే మరోసారి లాక్‌డౌన్ తప్పదని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ సడలింపులతో మహమ్మారి ముప్పు తీవ్రతరమైందని వెల్లడైతే లాక్‌డౌన్‌ను తిరిగి విధించేందుకు వెనుకాడబోమని, ప్రజలు దయచేసి ఒక చోట గుమికూడరాదని థాక్రే ట్వీట్ చేశారు.

Also Read:గుడ్‌న్యూస్‌: 'చివరి దశ ప్రయోగాలు, సెప్టెంబర్లో కరోనా వ్యాక్సిన్'

మహారాష్ట్రలో దశలవారీగా లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని, అయితే ప్రమాదం ఇంకా ముంగిటే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్ధిక వ్యవస్ధను నిర్వీర్యం చేయలేమని వ్యాఖ్యానించారు.

ప్రజల ప్రయోజనం కోసమే తాము పనిచేస్తున్నామని మహారాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నందునే వారు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్రలో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041కు పెరగ్గా.. 3,438 మంది మరణించారు.