Ahmednagar: దొంగ‌త‌నం చేశార‌నే అనుమానంతో చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి న‌లుగురు దళితులపై కొంద‌రు దుండ‌గులు దాడి చేశారు. వారిని క‌ర్ర‌ల‌తో కొడుతున్న వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు కేసు న‌మోదుచేసుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటుచేసుకుంది. 

4 Dalits hung upside down, beaten: దొంగ‌త‌నం చేశార‌నే అనుమానంతో చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి న‌లుగురు దళితులపై కొంద‌రు దుండ‌గులు దాడి చేశారు. వారిపై క‌ర్ర‌ల‌తో కొడుతున్న వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు కేసు న‌మోదుచేసుకుని నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో చోటుచేసుకుంది. మేక, పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో కొట్టార‌ని అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో మేక, పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో కొట్టారు. శ్రీరాంపూర్ తాలూకాలోని హరేగావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తర్వాత పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు అహ్మద్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. మ‌రో నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని పేర్కొన్నారు. 

ఆగస్టు 25న ఆరుగురు వ్యక్తులు 20 ఏళ్ల వయసున్న నలుగురు దళిత యువకులను గ్రామంలోని వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లారు. మేకను, పావురాలను దొంగిలించారనే అనుమానంతో బాధితులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో కొట్టారని తెలిపారు. నిందితులను యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు వీడియో తీశారనీ, అది సోషల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైరల్ అయిందని తెలిపారు.బాధితుల‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించామనీ, వారిలో ఒకరైన శుభం మగడే పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), 364 (కిడ్నాప్), ఇతర సంబంధిత నిబంధనలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ద‌ళితుడిని కొట్టి చంపారు.. 

మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. నిందితులు యువకుడి తల్లిని నగ్నంగా చేసి చితకబాదారు. బాధితురాలి సోదరి ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి నిరాకరించినందుకు గురువారం (ఆగస్టు 24) సాయంత్రం దళిత వ్యక్తిని కొట్టి చంపారు. అలాగే, 49 ఏళ్ల తల్లిని తొమ్మిది మంది నగ్నంగా చేసి, కొట్టారు. సమాచారం ప్రకారం ఈ కేసు ఖురై దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడియా నౌనగీర్ది. ఇక్కడ గురువారం రాత్రి కొందరు దుండగులు ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు 9 మంది నిందితులతో పాటు మరో నలుగురిపై హత్యతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడితో సహా 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనలో నిందితుడైన సర్పంచ్ భర్త, ఇతరులు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కలెక్టర్ దీపక్ ఆర్య కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులు 40 గంటల పాటు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించలేదు. 10 డిమాండ్లపై హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడి ఇంటిపై బుల్డోజర్ ప్రయోగించాలని మృతుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాన్ని దళిత దౌర్జన్యాల ప్రయోగశాలగా మార్చిందనీ, కాషాయ పార్టీ రాష్ట్రం నుండి నిష్క్రమించడం ఖాయమని ఆయన అన్నారు.