గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన బైక్‌ల చోరీ.. 13 వెహికిల్స్ రికవరీ చేసుకున్న పోలీసులు
గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి బాయ్‌ఫ్రెండ్ ఖరీదైన మోటార్ బైక్‌లను దొంగిలించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 వెహికిల్స్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

ముంబయి: ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఏకంగా బైక్‌ల దొంగగా మారాడు. విలువైన, ఖరీదైన బైక్‌లు చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా కన్నేసి కొట్టేశాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఏకంగా 13 బైక్‌లను చోరీ చేశాడు. ఒక్క బైక్ చోరీ కేసుల పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర థానే జిల్లా కళ్యాణ్ ఏరియాలో 19 ఏళ్ల యువకుడు భుశం భాస్కర్ పవార్ ఖరీదైన మోటార్ బైక్‌ను చోరీ చేశాడు. అది కూడా తన గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికే కొట్టేశాడని జోన్ 3, కళ్యాణ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సచిన్ గుంజల్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
ఆ యువకుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇంటరాగేషన్ చేస్తున్నారు. కేవలం కళ్యాణ్ నుంచే చోరీ చేయడం కాదు.. మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా అతను ఖరీదైన బైక్‌లను చోరీ చేసినట్టు కనుగొన్నారు. లాతూర్, సోలాపూర్, పూణెల వంటి ప్రాంతాల్లోనూ బైక్‌లను దొంగిలించాడు. ఈ 13 బైక్‌ల విలువ సుమారు రూ. 16.05 లక్షలు ఉంటుందని వివరించారు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇటీవలికాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి నేరాలకు పాల్పడే కల్చర్ పెరుగుతోంది. నేరాలు ఎలా చేయాలో, వాటి నుంచి ఎలా నేర్పుగా తప్పించుకోవాల్లో సినిమాల్లోనే చూపిస్తున్నారు మేకర్స్. వీటిని ఆసరాగా చేసుకుని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇక ఇటీవల సంక్రాంతికి విడుదలైన తమిళ అగ్రనటుడు అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమా చూసిన ఓ వ్యక్తి అందులో చూపించిన విధంగా బ్యాంక్‌కు కన్నం వేయాలని ప్రయత్నించి చివరికి కటాకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. తాడికొంబులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోకి ఖలీల్ రెహమాన్ అనే వ్యక్తి కారంపొడి, పెప్పర్ స్ప్రే, కటింగ్ బ్లేడ్, కత్తి తీసుకుని చొరబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో విధుల్లో వున్న ముగ్గురు బ్యాంక్ సిబ్బంది పై పెప్పర్ స్ప్రే చల్లి, వారిని ప్లాస్టిక్ బ్యాగ్‌లతో బంధించాడు. అయితే ఓ ఉద్యోగి ఎలాగో తప్పించుకుని బయటకు పరిగెత్తాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా కలిసి బ్యాంక్‌లోకి వెళ్లి ఖలీల్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.