ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఏర్పాట్ల పర్యవేక్షణకు పటిష్ట చర్యలు...

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మహాకుంభం 2025 కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ కు వచ్చే భక్తులకు చిరస్మరణీయమైన అనుభవం ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  

Mahakumbh 2025 Prayagraj Facility Management and Verification Process AKP

ప్రయాగరాజ్ : యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మహాకుంభం 2025 సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన శిబిరాలలో మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్తు వంటి అవసరమైన సేవలను అందించారు. అయితే ఈ ఏర్పాట్లు ఎలా జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం మేళా అథారిటీ అన్ని సెక్టార్లలో మూడు రౌండ్ల వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశించింది. వేర్వేరు వ్యవధిలో షెడ్యూల్ చేయబడిన ఈ తనిఖీలు అన్ని సంస్థలు అవసరమైన సేవలను ఎటువంటి అంతరాయం లేకుండా అందేలా చూస్తాయి. 

ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ అన్ని సెక్టార్ మెజిస్ట్రేట్‌లను సాఫ్ట్‌వేర్ ద్వారా సంస్థలకు కేటాయించిన భూమి, సౌకర్యాల వివరాలను తనిఖీచేసి అప్ డేట్ చేయాలని ఆదేశించింది. పారదర్శకతను నిర్ధారించడానికి 45 రోజుల ఈవెంట్‌లో మూడు విడతలుగా ఈ తనిఖీ ప్రక్రియను నిర్వహిస్తారు.  

మొదట జనవరి 12 నుండి ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది. రెండవ రౌండ్ ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 12 మధ్య షెడ్యూల్ చేయబడింది, చివరి తనిఖీ ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది.

సంస్థ పేరు, సగటు కల్పవాసుల సంఖ్య, నిర్వహించిన భండారాల సంఖ్య, పాల్గొన్నవారు, ప్రవచనాల సంఖ్య, శిబిరం వ్యవధి వంటి వివరాలను ఈ తనిఖీల సమయంలో సమీక్షిస్తారు. ఈ దశలవారీ చేపట్టే ఈ తనిఖీ ప్రక్రియ ఖచ్చితమైన పర్యవేక్షణ, మహాకుంభం 2025 పారదర్శకంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

భూమి, సౌకర్యాలు కేటాయించిన సంస్థలు ప్రతిపాదించిన కార్యకలాపాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడం ఈ తనిఖీ ప్రక్రియ లక్ష్యం. ఇది వారి కార్యకలాపాలను ధృవీకరించడమే కాకుండా సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లో వారి వివరాలను కూడా అప్ డేట్ చేస్తుంది.

అదనంగా ఈ ప్రక్రియ సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని నిర్వహించడానికి డేటా ఆధారిత వ్యవస్థను సులభతరం చేస్తుంది. కేటాయించిన భూమి, సౌకర్యాలు నిర్దిష్ట ఏర్పాట్ల ప్రకారం ఉపయోగించబడుతున్నాయా,  ఒప్పందం కుదుర్చుకున్న సరఫరాదారులు తమ పనులను పూర్తి చేశారా అని ఇది ధృవీకరిస్తుంది. ఈ క్రమబద్ధీకరించిన విధానం సరఫరాదారులకు చెల్లింపు ప్రక్రియ నియమాలకు అనుగుణంగా జరిగేలా చూస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios