సారాంశం

శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజు మీ ఆప్తులకు ఇలా శుభాకాంక్షలు పంపండి. 

మహా శివరాత్రి 2023 శుభాకాంక్షలు : దేశ వ్యాప్తంగా హిందూ పండుగ మహా శివరాత్రిని శనివారం (ఫిబ్రవరి 18)న అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శివపార్వతుల వివాహాన్ని పురస్కరించుకుని మహా శివరాత్రిని హిందువులు అత్యంత పవిత్రమైన, ప్రాముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. శివరాత్రి నాడు శివుడు 'తాండవ్' అని పిలిచే స్వర్గపు నృత్యాన్ని ప్రదర్శిస్తాడని కూడా నమ్ముతారు. శివరాత్రి అంటే - "శివుడి పవిత్రమైన రాత్రి".

అర్థనారీశ్వరుడు శివుడు. భార్యకు తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు. అర్థాంగిగా మార్చాడు. అందుకే, చాలా మంది హిందూ మహిళలు అతనిలాంటి భర్త తమకు దొరకాలని కోరుకుంటారు. శివుడు మొదట అరిద్ర నక్షత్రం రాత్రి లింగ రూపంలో అవతరించాడు. అదే మహా శివరాత్రి ప్రాముఖ్యతగా నిలిచింది. 

ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో శివరాత్రి శుభాకాంక్షలను తెలుపడానికి, వాట్సాప్ లో పంపడానికి ఎలాంటి కోట్స్ అయితే బాగుంటాయో చూడండి.. 

‘హ్యాపీ మహా శివరాత్రి 2023 శుభాకాంక్షలు..శివుడు మీకు శాంతి, ఆనందం, అదృష్టాన్ని సమృద్ధిగా కురిపించుగాక’

‘ఈ శివరాత్రి పర్వదినాన దైవ మహిమతో మీ సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. మీ పనుల్లో విజయం సాధించడంలో మీకు ఎల్లవేళలా తోడుంటాడు. మీకు, మీ కుటుంబానికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!’

‘మీకూ, మీ కుటుంబసభ్యులకు.. మీ ప్రియమైనవారికి ఆనందం, శాంతి చేకూరాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు’

హ్యాపీ మహా శివరాత్రి 2023 శుభాకాంక్షలు : ఈ శివరాత్రి మీ కోరికలన్నీ నెరవేరే శుభ దినం కావాలని కోరుకుంటున్నాను. 

మీకు, మీ కుటుంబ సభ్యులపై శివుడు తన ఆశీర్వాదాలను కురిపించుగాక.

‘ప్రతికూలతలను చెదరగొట్టి.. సానుకూల పరిస్థితులు ఏర్పడే రోజు శివరాత్రి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.’

హ్యాపీ మహా శివరాత్రి 2023 శుభాకాంక్షలు : మీ జీవితం ఆనందంతో సమృద్ధిగా మారాలని కోరుకుంటున్నాను! 

*మీ జీవితంలోని కష్టాలన్నీ పరమశివుడు పోగొట్టును గాక.