Asianet News TeluguAsianet News Telugu

ఇక బీజేపీ టార్గెట్ మధ్యప్రదేశ్: దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలంటూ సీఎం సవాల్

మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మాదిరిగానే సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. 

madhyapradesh cm kamal nath serious comments on opposition leader gopal bhargava
Author
Bhopal, First Published Jul 24, 2019, 8:28 PM IST

మద్యప్రదేశ్: కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచినా అధికారానికి దూరమైన బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నించింది. అదే సభ్యులతో 14 నెలల అనంతరం తిరిగి అధికారంలోకి వచ్చింది. 

కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేసింది బీజేపీ. ఎట్టకేలకు మళ్లీ అధికారాన్ని చేపట్టబోతుంది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా కుప్ప కూల్చడంతో ఇప్పుడు అందరి దృష్టి మధ్యప్రదేశ్ పై పడింది. 

మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మాదిరిగానే సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బేదాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. 

అయితే ఇదే అంశంపై మధ్యప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్, ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవల మధ్య సవాల్ ప్రతిసవాల్ తో సభ దద్దరిల్లింది. తమ ప్రభుత్వం ఐదేళ్లపాటు పూర్తికాలం పాలన కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తమ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. అమ్మకానికి తమ ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరంటూ చెప్పుకొచ్చారు. ఈ ఐదేళ్లపాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

పూర్తి సామర్థ్యం, సంఖ్యాబలంతో పనిచేస్తామని మధ్య ప్రదేశ్ అభివృద్ధే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు సీఎం కమల్ నాథ్. సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ నంబర్ 1, నెంబర్ 2ల నుంచి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా నిలబడదు అంటూ సెటైర్లు వేశారు. 

ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కమలనాథ్ దమ్ముంటే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. ఇకపోతే ఇటీవలే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో చిన్నచిన్న బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయంటూ చెప్పుకొచ్చారు. 

మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాదిపార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలైన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల మద్దతు ఉండకపోవచ్చంటూ బాంబు పేల్చారు. 

శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యాలు చేసిన మరుసటి రోజే అసెంబ్లీలో ఇలాంటి సవాల్ ప్రతిసవాల్ లకు అధికార, ప్రతిపక్ష పార్టీలు దిగడం చర్చనీయాంశంగా మారింది. మాజీముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానంపై జరిగిన రచ్చ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios