రీల్ కాదు రియల్ స్టోరీ: ప్రేమను నిరూపించుకొనేందుకు తుపాకీతో కాల్చుకొన్నాడు

Madhya Pradesh: Youth BJP leader shoots self to ‘prove’ love for woman
Highlights

తన ప్రేమను నిరూపించుకొనేందుకుగాను అతుల్ అనే వ్యక్తి ప్రియురాలి ఇంటి ముందే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చచ్చిపోయి ప్రేమను నిరూపించుకోవాలని లవర్ తండ్రి సూచించడంతో అతుల్ తుపాకీతో కాల్చుకొన్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నాడు. 13 ఏళ్ల వీరి ప్రేమకు ప్రియురాలి తండ్రి ఒప్పుకోకపోవడంతో అతుల్ ఈ పని చేశాడు.


భోపాల్: అచ్చు సినిమాలో మాదిరిగానే  తన ప్రేమను నిరూపించుకొనేందుకు గాను  ఓ యువకుడు  తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియురాలి ఇంటి ముందే ఈ సాహసం చేశాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో బీజేవైఎం ఉపాధ్యక్షుడు అతుల్ లో ఖండే మంగళవారం రాత్రి తాను ప్రేమిస్తున్న యువతి ఇంటి ఎదురుగానే తుపాకీతో కాల్చుకొని తన ప్రేమను నిరూపించుకొన్నాడు.

ప్రియురాలి తండ్రి తన కూతురిపై ప్రేమ ఉంటే చచ్చిపోయి నీ ప్రేమను నిరూపించుకో అంటూ అతుల్ లో ఖండేకు చెప్పాడు.  దీంతో  తన బంధువుతో కలిసి మంగళవారం రాత్రి ప్రియురాలి ఇంటికి చేరుకొన్నాడు.

తన వెంట తెచ్చుకొన్న తుపాకీతో  ప్రియురాలి ఇంటి ఆవరణలో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తుపాకీ పేలిన శబ్దం విన్న వెంటనే అతుల్ బంధువు వెంటనే కారులో అతడిని ఆసుపత్రికి తరలించాడు. తీవ్రంగా గాయపడిన అతుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 

తుపాకీతో కాల్చుకొనే ముందు అతుల్ తన ఫేస్ బుక్ పేజీలో  తన ప్రేమికురాలి తండ్రి ప్రేమను చచ్చిపోయి నిరూపించుకోవాలని తనకు సూచించాడని ఆయన పోస్ట్ చేశాడు. ఆమె లేకుండా తాను బతకలేనని ఇది తన నిర్ణయం అంటూ పోస్ట్ చేశాడు. 

దాదాపు 13 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమను ప్రియురాలి తండ్రి అంగీకరించలేదు. ప్రియురాలి తండ్రి కోరిక మేరకు తన ప్రేమను నిరూపించుకొనేందుకు  అతుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

loader