Asianet News TeluguAsianet News Telugu

వర్షపునీటితో నిండిన గొయ్యిలో మునిగి ముగ్గురు బాలికలు మృతి

Madhya Pradesh: ఇటీవ‌ల కురిసిన వాన‌ల కార‌ణంగా వ‌ర్ష‌పు నీటితో నిండిన ఒక గుంత‌లో మునిగి ముగ్గురు మైన‌ర్ బాలిక‌లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. 
 

Madhya Pradesh: Three girls drown in a pit filled with rainwater
Author
First Published Oct 2, 2022, 5:12 PM IST

3 Girls Drown In Rainwater-Filled Pit: ఇటీవ‌ల కురిసిన వాన‌ల కార‌ణంగా వ‌ర్ష‌పు నీటితో నిండిన ఒక గుంత‌లో మునిగి ముగ్గురు మైన‌ర్ బాలిక‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో వర్షపు నీటితో నిండిన గొయ్యిలో ముగ్గురు మైనర్ బాలికలు మునిగి మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు. శ‌నివారం సాయంత్రం కడియాకాల గ్రామంలో నీటితో నిండిన గొయ్యిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల మృతదేహాలు తేలిన త‌ర్వాత విష‌యం వెలుగులోకి వ‌చ్చింద‌ని పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. చ‌నిపోయిన బాలిక‌లు వ‌య‌స్సు ఐదు నుంచి ఏడేండ్ల ఉంటుంద‌ని పేర్కొన్నారు. 

ఐదు నుంచి ఏడేళ్ల వయసున్న బాలికలు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరారని తెలిపారు. అయితే, వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే పొలానికి సమీపంలోని గొయ్యిలో మృతదేహాలు తేలాయని ఆయన చెప్పారు. బాలికలు ఆడుకుంటూ జారి గొయ్యిలో పడి ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి తదుపరి పరిశోధనలు జరుగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో మ‌రో విషాదం 

ఈత‌కు కొట్ట‌డానికి స్థానిక చెరువులోకి వెళ్లి న‌లుగురు మైన‌ర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే..  రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి లోని చెరువు వ‌ద్ద‌కు ఈత కొట్ట‌డానికి వెళ్లిన న‌లుగురు మైన‌ర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జ‌రిగిన ఈట‌న‌లో 12 ఏళ్లలోపు బాలికతో సహా నలుగురు చిన్నారులు గ్రామంలోని చెరువులో మునిగి చనిపోయార‌ని స్థానికులు చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఈతకు వెళ్లి ట్యాంక్‌లో మునిగి చనిపోయారు. దసరా సెలవులు కావడంతో పిల్లలు సరదగా ఈతకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ లోనూ..

గ‌త వారం ఛత్తీస్‌గఢ్ లో కూడా ఇలాంటి నీటితో నిండిన గుంత‌లో ప‌డి ఐదేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివ‌రాల్లోకెళ్తే.. కన్హర్‌గావ్‌లోని జల్ జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ తయారు చేసేందుకు తవ్విన గొయ్యి నీటిలో మునిగి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ట్యాంకు నిర్మాణ బాధ్యతలను కాంట్రాక్టర్‌పైనే పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద, భానుప్రతాపూర్ బ్లాక్ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కన్హర్‌గావ్‌లో పీహెచ్‌ఈ విభాగం ద్వారా వాటర్ ట్యాంక్‌ను నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ పెద్ద గొయ్యి తవ్వి ఇలా వదిలేశాడు. వర్షం కారణంగా నీటితో నిండిపోయినా ఆ తర్వాత కూడా అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేయలేదు. గ‌త గురువారం మఖన్ యాదు అనే 5 ఏళ్ల బాలుడు తన సోదరితో ఆడుకుంటూ గుంత వద్దకు చేరుకుని అందులో పడిపోయాడు. ఇంటికి చేరుకున్న అక్కా, ప్రమాదం గురించి అందరికీ తెలియజేసింది. బంధువులు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Follow Us:
Download App:
  • android
  • ios