Asianet News TeluguAsianet News Telugu

కమల్ నాథ్ సర్కారుకు 24 గంటల డెడ్ లైన్ విధించిన సుప్రీం

మధ్యప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రేపు, బుధవారం ఉదయం 10.30 కల్లా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కమల్ నాథ్ సర్కారుకు కు ఆదేశాలు జారీ చేసింది. 

Madhya Pradesh political crisis: Supreme Court issues 24 hour notice to Kamal Nath govt to conduct floor test
Author
New Delhi, First Published Mar 17, 2020, 1:42 PM IST

మధ్యప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రేపు, బుధవారం ఉదయం 10.30 కల్లా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కమల్ నాథ్ సర్కారుకు కు ఆదేశాలు జారీ చేసింది. 

నిన్న ఉదయం బడ్జెట్ సమావేశాల తొలిరోజు కావడంతో గవర్నర్ తన ప్రసంగంలో అన్ని పేజీలను చదవకుండా కేవలం చివరి పేజీ ఒకటే చదివి ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు చట్టప్రకారం నడుచుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే!

గవర్నర్ తన ప్రసంగం ముగించి వెళ్లిన తరువాత స్పీకర్ సభను 26వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు స్పీకర్ తెలిపారు. 

సభ నుండి స్పీకర్ సహా కాంగ్రెస్ సభ్యులు వెళ్ళిపోయినా... బీజేపీ సభ్యులు మాత్రం అక్కడే నినాదాలు చేసుకుంటూ బైఠాయించారు. వారు ఆ తరువాత శివరాజ్ సింగ్ చౌహన్ అధ్యక్షతన వెళ్లి గవర్నర్ లాల్జీ టాండన్ ని కలిశారు. లాల్జీ టాండన్ ముందు బీజేపీ శాసన సభ్యులతో పెరేడ్ నిర్వహించారు. 

Also read: మధ్యప్రదేశ్ హై డ్రామా: కమల్ నాథ్ కు ఊరట, అసెంబ్లీ 26 వరకు వాయిదా!

గవర్నర్ కి పదే పదే వారు తమకు మాత్రమే మెజారిటీ ఉందని, కాంగ్రెస్ మైనారిటీలో ఉందని విజ్ఞప్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిన్న గవర్నర్ కమల్ నాథ్ కు నిన్ననే బలపరీక్ష జరిపమని కోరారు. స్పీకర్ కి కూడా సమాచారం అందించారు. 

అయినా కూడా నిన్నటి ఉదయం అలాంటిదేమి జరగకుండానే సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నేటిలోగా బలనిరూపణ చేసుకోకుంటే... ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినట్టు భావించాల్సి వస్తుందని గవర్నర్ కమల్ నాథ్ కు అల్టిమేటం జారీ చేసాడు. 

గవర్నర్ వద్దకు వెళ్లిన తరువాత, బీజేపీ నేతలు కోర్టుకెక్కారు. కాంగ్రెస్ కు మెజారిటీ లేకున్నా సాకులు చెప్పి కాలయాపన చేస్తుందని, వెంటనే బలపరీక్ష జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. 

దీన్ని అత్యవసరమైన పిటిషన్ గా పరిగణించిన న్యాయస్థానం విచారణ చేపట్టి కమల్ నాథ్ సర్కారుకు 24 గంటల సమయం ఇస్తూ... రేపు బుధవారం ఉదయం 10.30 కల్లా బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఆదేశించింది. 

ఇకపోతే... ఎప్పుడు బలపరీక్ష నిర్వహించినా తాము గెలుస్తామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ వారి వద్ద బల నిరూపణకు అవసరమైన సంఖ్యా బలం లేదు. నేడు బడ్జెట్ సమావేశాల తొలిరోజు కావడంతో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. స్పీకర్ ని బలపరీక్ష నిర్వహించమని ఆదేశించినప్పటికీ ఆయన మాత్రం దానిపైన ముందుకు వెళ్లేలా కనబడడం లేదు. 

గవర్నర్ ప్రసంగించినతరువాత ముఖ్యమంత్రి కమల్ నాథ్ ని చట్టప్రకారంగా నడుచుకోవాలని కోరారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సదన్ కా ఆదర్ కారో అని అరిచారు. దాని అర్థం, వారు సభను నడిపే పూర్తి అధికారాలను స్పీకర్ కలిగి ఉన్నారనేది, ఆయన సభను నడపనివ్వాలనేది వారు కోరిన అంశం.  

గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీజేపీ, కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 26వతేది వరకు అసెంబ్లీని వాయిదా వేశారు. 

బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లకుండా లోపలే బైఠాయించి నినాదాలను చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి జిందాబాద్ కమల్ నాథ్ అంటూ నినాదాలు చేసారు. 

22 మంది రెబెల్ ఎమ్మెల్యేలలో కేవలం 6గురి రాజీనామాను మాత్రమే ఆమోదించారు. మిగిలిన సభ్యుల రాజీనామాలను ఆమోదించాలంటే వారిని ప్రత్యక్షంగా కలవాలని, వారిని రాజీనామా ఏ పరిస్థితుల్లో చేసారో తెలుసుకోవాలని అంటున్నారు. అందుకు సంబంధించి రెబెల్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే రెండవసారి హాజరు కమ్మని వర్తమానం పంపారు. 

ఇలా ఒకటి రెండు రోజులు సమయం దొరికితే ఆ లోపల ఆ రెబెల్ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకోవచ్చని వారు భావిస్తున్నారు. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నారు. వారు భోపాల్ కి వస్తే ఒక్క ఛాన్స్ దొరికినా తిప్పుకోవచ్చని కమల్ నాథ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక పోతే జ్యోతిరాదిత్య సింధియాకు సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా బయటకు వెళ్లిన తరువాత వారు ఆరోజు నుండి బెంగళూరులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios