Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ బిల్లు ఎగవేతదారుల్లో మంత్రి టాప్.. రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటన

మధ్యప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు కట్టని వారి జాబితాను విద్యుత్ శాఖ విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేరు టాప్‌లో వచ్చింది. వీటితోపాటు కలెక్టర్ కార్యాలయం , ఎస్పీ బంగ్లాలూ సహా పలవురు ఉన్నారు. విద్యుత్ శాఖ లెక్క ప్రకారం 84,388 కట్టాల్సి ఉన్నది,
 

madhya pradesh minister top in electricity bill defaulter list
Author
Bhopal, First Published Dec 23, 2021, 6:33 AM IST

భోపాల్: మధ్యప్రదేశ్(Madhya pradesh) విద్యుత్ శాఖ(Electricity Department) బిల్లు ఎగవేతదారుల జాబితా(Defaulters List) విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ టాప్‌లో ఉన్నారు. మంత్రితోపాటు మరికొందరు ప్రముఖులూ విద్యుత్ బిల్లు ఎగవేత దారుల జాబితాలో ఉన్నారు. కలెక్టర్ బంగ్లా, ఎస్పీ కార్యాలయం సహా మరికొన్ని నివాసాలు లేదా ఆఫీసులు విద్యుత్ బిల్లు కట్టడం లేదు. విద్యుత్ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాష్ట్ర మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ రూ. 84,388 కట్టాల్సి ఉన్నది.

కాగా, రాష్ట్ర మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ సోదరుడు గులాబ్ సింగ్ రాజ్‌పుత్ పేరు ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నది. ఇదే జాబితా ప్రకారం, కలెక్టర్ బంగ్లా రూ. 11,445, సీఈవో ఆఫ్ కంటోన్మెంట్ రూ. 24,700, వకీల్ చంద్ గుప్తా రూ. 40,209, ఎస్పీ కార్యాలయం రూ. 23,428లు చెల్లించాల్సి ఉన్నది. విద్యుత్ బిల్లులు కట్టని వారికి.. విద్యుత్ శాఖ వెంటనే బిల్లులు చెల్లించాల్సిందిగా ఎస్ఎంఎస్ రూపంలో రిక్వెస్ట్ పెట్టింది. ఈ విజ్ఞప్తితోపాటు వెంటనే బిల్లులో పేర్కొన్న మొత్తాలను బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని తెలిపింది. వీలైనంత తొందరగా ఈ పెండింగ్ బిల్లులను వసూలు చేయాలని విద్యుత్ శాఖ భావిస్తున్నది. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ వారి కరెంట్ కనెక్షన్ తీసేయవచ్చునని పేర్కొన్నారు.

Also Read: రూ. 3 కోట్ల బకాయిలు: ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేత

మిగతా విద్యుత్ వినియోగదారులకూ ఫోన్ కాల్స్ చేస్తున్నట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ ఎస్‌కే సిన్హా పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందిగా ఎస్ఎంఎస్‌లు, నోటీసులు పంపుతున్నామని వివరించారు. బిల్లు కడితే సరే.. లేదంటే యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

రాష్ట్రంలో విద్యుత్ బకాయిలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ స్పందించారు. విద్యుత్ వినియోగదారులు వెంటనే బిల్లులు కట్టాలని సూచనలు చేశారు. ‘విద్యుత్ బిల్లులు చెల్లించే స్తోమత కలిగి ఉన్న వినియోగదారులు వెంటనే బిల్లులు కట్టాలి. స్తోమత లేదంటే.. వారి పరిస్థితులను ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుంటుంది. బిల్లులు చెల్లించే సామర్థ్యం కలిగి ఉండి కూడా కట్టకుంటే.. వారి కరెంట్ కనెక్షన్స్ తీసేస్తం. చట్టం ముందు అందరూ సమానులే. అది నేనైనా అంతే. ప్రతి ఒక్కరికీ చట్టం విలువ ఒకటే’ అని వివరించారు.

Also Read: తెలంగాణ థర్మల్ పవర్ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు నిల్వలు: కోల్ సరఫరాపై సింగరేణిపై తీవ్ర ఒత్తిడి

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో హైద్రాబాద్ Uppal stadiumకి విద్యుత్ సరఫరాను ఈ నెలలోనే నిలిపివేశారు Tssspdcl అధికారులు. అయితే విద్యుత్ బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా కూడా స్పందించలేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు.  రూ. 3 కోట్ల రూపాయాల విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టుగా విద్యుత్ శాఖాధికారుల తెలిపారు. అయితే విద్యుత్ బకాయిలు చెల్లించకుండా అక్రమంగా విద్యుత్ ను ఉపయోగిస్తున్నారని ఉప్పల్ స్టేడియం యాజమాన్యంపై  కేసు నమోదు చేశామని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios