Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ థర్మల్ పవర్ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు నిల్వలు: కోల్ సరఫరాపై సింగరేణిపై తీవ్ర ఒత్తిడి


తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ పవర్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గాయి. మరో వైపు ఇతర రాష్ట్రాల్లోని పవర్ ప్లాంట్లకు కూడా బొగ్గు కోసం డిమాండ్ నెలకొంది. గత నెలలో కేటాయించిన డిమాండ్ కోటాను ఇప్పుడు సరఫరా చేయాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి.

Coal stocks in Telangana decline; SCCL under pressure
Author
Hyderabad, First Published Oct 13, 2021, 9:51 AM IST

హైదరాబాద్:telangana రాష్ట్రంలోని thermal power  కేంద్రాల్లో coal నిల్వలు తగ్గు ముఖం పడుతున్నాయి.  మరో వైపు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా విషయమై singareni colleries company limitedపై  తీవ్ర ఒత్తిడి ఉంది.

also read:విద్యుత్ సంక్షోభం.. తెలంగాణ రాష్ట్రం ఏపీకి బొగ్గును ఇవ్వడంలేదు: మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత విద్యుత్ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెులంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యత్ కేంద్రాల్లో గత వారంలో 10 నుండి 15 రోజులకు బొగ్గు నిల్వలున్నాయి. అయితే అవి ఇప్పుడు కేవలం ఐదు రోజులకు మాత్రమే సరిపోనున్నాయి.

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా విషయమై సింగరేణి కాలరీస్ తో ఒప్పందం ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీలో telangana government కు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం వాటా కేంద్రానిది.

గత నెలల్లో కేటాయించిన బొగ్గు నిల్వలను కొన్ని రాష్ట్రాలుప్రస్తుతం ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి..రాష్ట్రంలో విద్యుత్ కొరత ఆందోళనకరంగా లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి jagadish reddy చెప్పారు.సింగరేణిలోని బొగ్గు నిల్వలను ఇతర రాష్ట్రాలకు తరలించి తెలంగాణను సంక్షోభంలోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి  నుండి బొగ్గు అందుతుందని మంత్రి వివరించారు. తెలంగాణలో బొగ్గు కొరతకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రానున్న  రోజుల్లో తెలంగాణలో బొగ్గుతో పాటు విద్యుత్ కొరతను ఎదుర్కొంటే కేంద్రమే బాధ్యత వహించాల్సి వస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు.

వచ్చే 200 ఏళ్ల అవసరాలను తీర్చగలిగే బొగ్గు నిల్వలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని బొగ్గు నిల్వలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తేనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొనే అవకాశం ఉందన్నారు.

థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ప్రతి రోజూ 1.90 లక్షల టన్నుల బొగ్గు సరఫరా లక్ష్యంగా కాగా, 1.50 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నామని  సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్లు చంద్రశేఖర్, ఎన్ . బలరామ్ లు మీడియాకు చెప్పారు.

తెలంగాణ జెన్‌కో థర్మల్ పవర్ ప్లాంట్,  కడప జిల్లా ముద్దనూరులోని ఏపీ జెన్‌కో ప్లాంట్ , మహారాష్ట్రలోని పరాలీ జెన్ కో ప్లాంట్,కర్ణాటకలోని రాయచూర్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని మెట్టూరు,  తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీతో ఒప్పందం ఉంది.

తెలంగాణలో బొగ్గు సంక్షోభం భయాలను సింగరేణి కాలరీస్ అధికారులు తొలగించారు.  రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరాకు ప్రాధాన్యత ఇస్తామని సింగరేణి డైరెక్టర్లు తేల్చి చెప్పారు.ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ ప్లాంట్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు కేటాయించిన బొగ్గును వాడుకోలేదు. అయితే ఈ కోటాను ఇప్పుడు ఉపయోగించుకొంటామని ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. తమ కోటా మేరకు  బొగ్గును సరఫరా చేయాలని సింగరేణిపై ఆ రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి.

మహారాష్ట్రలోని థర్మల్ ప్లాంట్లకు పశ్చిమ ప్రాంతానికి చెందిన బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు సరఫరా  అవుతోంది. అయితే అక్కడ బొగ్గు నిల్వలు లేకపోవడంతో మహారాష్ట్రకు బొగ్గు సరఫరా కోసం సింగరేణిపై ఒత్తిడి పెరిగింది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడ బొగ్గును సరఫరా చేయాలనే డిమాండ్ రావడంతో సింగరేణి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మెన్, ఎండీ ఎన్ శ్రీధర్ ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. ఈ తేదీల్లోనే బొగ్గు సరఫరా కోసం సింగరేణిపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఢిల్లీకి చెందిన ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఎండీ సెలవులో వెళ్లారనే ప్రచారం కూడా లేకపోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios