Asianet News TeluguAsianet News Telugu

కోటి రూపాయల బీమా డబ్బుల కోసం..చనిపోయినట్లు నాటకం.. చివరికి...

అర్థాంతరంగా చనిపోతే తమ మీద ఆధారపడిన వారు అనాథలుగా మారకుండా.. జీవితానికి ఓ భరోసాలా ఉండే జీవితబీమాను కొందరు తమ స్వార్థానికి వినియోగిస్తున్నారు. చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి మోసానికి పాల్పడుతున్నారు.

Madhya Pradesh : Man Fakes His Death To Claim Rs 1 Cr Insurance; Arrested
Author
Hyderabad, First Published Nov 9, 2021, 2:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేవాస్ :  కోటి రూపాయల బీమా పరిహారం పొందేందుకు చనిపోయినట్లు నాటకానికి తెర తీశాడు ఓ ప్రబుద్ధుడు.  చివరికి అసలు విషయాన్ని కనిపెట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.  మధ్యప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని దేవాస్ కు చెందిన హనీఫ్ (46), 2019 సెప్టెంబర్ లో ఒక కంపెనీ నుంచి కోటి రూపాయల విలువైన Insurance policy తీసుకున్నాడు.

రెండు వాయిదాలు కట్టిన తర్వాత అతనికి దుర్బుద్ధి పుట్టింది.  తాను మరణించినట్లు పత్రాలు సృష్టించి కోటి రూపాయలు కొట్టేయాలని భావించాడు. దీనికోసం పక్కా ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను భార్య, కొడుకుకు వివరించాడు. డబ్బలు వస్తాయన్న ఆశతో వారూ దీనికి ఒప్పుకున్నారు. 

తన ప్లాన్ లో భాగంగా తాను చనిపోయినట్లు death certificate కావాలి. దీనికోసం షకీర్  మన్సూరి అనే వైద్యుడు సాయం తీసుకున్నాడు. మన్సూరి హనీఫ్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు.  ఆ పత్రం సహాయంతో Hanif భార్య రెహానా,  కుమారుడు ఇక్బాల్  కోటి రూపాయల బీమా పరిహారం పొందేందుకు దరఖాస్తులు సమర్పించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన సదరు కంపెనీ 
Devas పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.  విచారణలో హనీఫ్ సజీవంగానే ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. స్వయంగా భార్య, కొడుకే తండ్రి చనిపోయాడంటూ నాటకం ఆడారని కనిపెట్టారు. దీనికి సూత్రదారి సదరు బీమా దారుడే అని తెలిసి ఆశ్చర్యపోయారు. 

దీంతో వెంటనే ..ఈ మేరకు నవంబర్ 7వ తేదీన  ఫోర్జరీ కేసు లో భాగంగా హనీఫ్, అతని భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ తో పాటు  నకిలీ మరణ ధృవపత్రాన్ని  సృష్టించిన  షకీర్  మన్సూరిని arrest చేశారు. షకీర్  మన్సూరి Medical degree పైనా విచారణ చేస్తున్నట్లు దేవాస్ police station బాద్యుడు ఉమ్రావ్ సింగ్ తెలిపారు. 

ఇదిలా ఉండగా గతనెలలో ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఓ వ్యక్తి తన స్వార్ధం కోసం మానసిక స్థితి లేని మరో వ్యక్తిని దారుణంగా చంపేశాడు. బీమా డబ్బులను పొందేందుకు (claim insurance money) మరో కొందరితో కలిసి ఈ హత్య చేశాడు. అనంతరం చనిపోయింది తానేనంటూ పత్రాలు సృష్టించాడు. అయితే బీమా కంపెనీకి అనుమానం రావడంతో అతని అసలు కథ వెలుగుచూసింది. 

ఈ ఘటన మహారాష్ట్రలోని Ahmednagar district అకోల్ తహసీల్ పరిధిలోని రాజూర్ గ్రామంలో చోటుచేసకుంది. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతనికి సాయం చేసిన మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రభాకర్ వాఘ్‌చౌరే అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా అమెరికాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు అమెరికాలోని ఓ సంస్థ నుంచి 5 మిలియన్ డాలర్ల(రూ. 37.5 కోట్లు) విలువైన బీమా తీసుకున్నాడు. అయితే ప్రభాకర్ 2021లో జనవరిలో ఇండియాకు వచ్చాడు. అహ్మద్‌నగర్ జిల్లాలోని Dhamangaon Pat అనే గ్రామంలో తన అత్తమామల వద్ద నివసించేవాడు.  

పూర్తి కథనం కోసం మానసిక స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటుతో చంపేశారు.. ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఇంత నీచమా..? చదవండి..

 

 

Follow Us:
Download App:
  • android
  • ios