ఐదు రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భాగోతం ఇప్పడు మధ్యప్రదేశ్ లో చర్చనీయంశంగా మారింది. ఇండోర్ లోని ముసాఖేడి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు డిసెంబరు 2వతేదీన ఖాండ్వా ప్రాంతంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన ఐదు రోజులకే అంటే డిసెంబర్ 7వతేదీన ఇండోర్ లోని మోవ్ లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

మొదటి భార్య కుటుంబానికి ఈ విషయం తెలియడంతో నిందితుడి మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోవ్ ప్రాంతంలో వివాహ విందుకు వెళ్లిన ఖండ్వా బాధితురాలి బంధువు ద్వారా ఈ పెళ్లికొడుకు బండారం బయటపడింది. అతను ఆ రెండో పెళ్లి జరుగుతున్న ఫొటోను ఫోన్ లో క్లిక్ చేసి బాధితురాలి కుటుంబానికి పంపించాడు.
దీంతో ఖండ్వాలో పెళ్లాడిన మహిళ తన భర్త రెండో పెళ్లి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖండ్వా పెళ్లికూతురు కట్నం, ఇంటి వస్తువుల కింద రూ.10 లక్షలు ఖర్చు చేసింది. ఈ ప్రబుద్దుడు డిసెంబర్ 2న పెళ్లి తరువాత మొదటి భార్యను తన ఇంటికి తీసుకువెళ్లి, ఆ తరువాత భోపాల్ లో పని ఉందని చెప్పి వెళ్లాడు.
అలా మోవోకు వెళ్లి మరో పెళ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. రెండో పెళ్లి తర్వాత నిందితుడు డిసెంబరు 7న పారిపోయాడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 21, 2020, 10:04 AM IST