Asianet News TeluguAsianet News Telugu

నా మీసం.. నాకు గర్వకారణం.. కత్తిరించడానికి నిరాకరించిన పోలీసు.. సస్పెన్షన్ వేటు

మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన ఎదురైంది. ఓ కానిస్టేబుల్ తన మీసాన్ని గదవ మీదుగా మెడ వరకు పెంచుకున్నాడు. ఆ మీసాన్ని కత్తిరించాల్సిందిగా పై అధికారులు పలుమార్లు ఆదేశించారు. కానీ, ఆయన తన యూనిఫామ్‌ను అన్ని విధాలు సరిగా మెయింటెయిన్ చేసినా.. మీసాలను కత్తిరించడానికి మాత్రం అంగీకరించలేదు. దీంతో పై అధికారులు ఆదేశాలు ఉల్లంఘించినందున ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తానుు రాజ్‌పుత్ అని.. తన మీసాలే తనకు గర్వకారణమని ఆ కానిస్టేబుల్ పేర్కొనడం గమనార్హం.
 

madhya pradesh constable refused to trim moustache got suspended
Author
Bhopal, First Published Jan 9, 2022, 8:15 PM IST

భోపాల్: కొందరికి విచిత్రమైన ఇష్టాలు ఉంటాయి. కొందరికి వారి ముక్కు అంటే.. ఇంకొందరికి ముక్కు.. మరికొందరు జుట్టు ఇలా రకరకాల మనుషులను చూస్తుంటాం. కానీ, కొన్ని ఇష్టాలు... వారికి ఆధిపత్యాన్ని, పరువును చూపించేవిగానూ పరిణామం చెందుతుంటాయి. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన ఓ పోలీసు (Police Constable) తన మీసం కట్టు ఒక ఆత్మాభిమాన సంకేతంగా భావిస్తుంటాడు. అంతేకాదు, అదే తనకు గర్వకారణమని(Pride) చెప్పుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మీసాన్ని తగ్గించేదే లేదని తీర్మానించుకుని ఉన్నాడు. తనపై సస్పెన్షన్ (Suspension) వేటు వేస్తామన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

మధ్యప్రదేశక్‌కు చెందిన రాకేశ్ రానా కానిస్టేబుల్. రాష్ట్ర పోలీసుల రవాణా విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మీసాలు గదవ దాటి మెడ వరకు పెంచుకున్నాడు. అవి కొంత ఎబ్బెట్టుగానూ మరికొంత అందవికారంగానూ ఉన్నాయి. ఆ మీసాలు పోలీసుల పట్ల తప్పుడు సందేశాన్ని పంపే అవకాశం ఉన్నదని పై అధికారులు భావించారు. తోటి ఉద్యోగులకూ ఆయనపై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని యోచించారు. అందుకే తన మీసాలను కత్తిరించుకోవాల్సిందిగా కానిస్టేబుల్ రాకేశ్ రానాను ఆదేశించారు. కానీ, ఆయన అందుకు ససేమిరా అన్నాడు. తాను తన మీసాలను కత్తింరించే ఛాన్సే లేదని స్పష్టం చేశాడు. ఆ మీసాలు తనకు ఆత్మాభిమాన సంకేతాలు అని తెలిపాడు. పై అధికారులు ఎన్ని సార్లు కత్తిరించాలని సూచించినా.. ఆయన వాటిని ఖాతరు చేయలేదు. తాను రాజ్‌పుత్ అని.. తన మీసాలే.. తనకు గర్వకారణమని డిక్లేర్ చేశాడు.

దీంతో పై అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేట వేశారు. ఆయన అప్పియరెన్స్ గురించి పై అధికారుల ఆదేశాలను శిరసావహించలేదని పేర్కొంటూ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ కానిస్టేబుల్ రాకేశ్ రానాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ రానా అప్పియరెన్స్ చూస్తే.. ఆయన తన జుట్టును పెద్దగా పెంచుకున్నాడని, మీసాలను మెడ వరకు పెంచుకుంటున్నాడని పేర్కొన్నారు. మీసాలు ఒక కానిస్టేబుల్‌గా సరైన రూపాన్ని చూపడం లేదని, వాటిని కత్తిరించాల్సిందిగా అధికారులు పలు సార్లు ఆదేశించారని, కానీ, కానిస్టేబుల్ రాకేశ్ రానా ఆ ఆదేశాలను బేఖాతరు చేశారని పేర్కొన్నారు. రాకేశ్ రానా తన యూనిఫామ్‌ను అన్ని విధాల్లో సరిగ్గా మెయింటెయిన్ చేశాడని, కానీ, సస్పెన్షన్ వేటు విధించినా ఆయన తన మీసాలను కత్తిరించడంపై రాజీ పడలేదని వివరించారు. చాలా కాలంగా ఆయన తన మీసాలను అలా మెడ వరకు పెంచుకుని మెయింటెయిన్ చేస్తున్నాడని తెలిపారు.

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ జాక్  కలిస్ గురించి తెలియని క్రికెట్‌ అభిమాని ఉండడు.  ఒక చాలెంజ్‌లో భాగంగా ఆయన సగం గడ్డం, సగం మీసంతో దర్శనమిచ్చాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా ‘సేవ్‌ ద రైనో’ చాలెంజ్‌ను స్వీకరించిన జాక్ కలిస్ ఇలా దర్శనమిచ్చి ఫాన్స్ ను ఆశ్చర్యపరిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios