మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. వారం రోజుల తర్వాత ముంబైలో ఆచూకీ..

వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి అపహరణకు గురై 12 ఏళ్ల బాలుడిని ముంబైలో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రైం బ్రాంచ్‌లోని యూనిట్ 10 సిబ్బంది బుధవారం అంధేరీ ప్రాంతంలో బాలుడు సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

Madhya Pradesh Boy Kidnapped Found After One Week In Mumbai KRJ

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా నుంచి కిడ్నాప్‌కు గురైన 12 ఏళ్ల బాలుడు వారం రోజుల తర్వాత ముంబైలో దొరికాడు. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి  12 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేశాడు. ఆ బాలుడి ఆచూకీ ముంబైలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌లోని యూనిట్ 10 సిబ్బంది బుధవారం అంధేరి ప్రాంతంలో బాలుడిని కనుగొన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

పోలీసులు ఆ బాలుడితో మాట్లాడినప్పుడు.. ఆ పిల్లవాడుచాలా భయపడ్డాడు. తాను మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలోని తన గ్రామం పేరు మాత్రమే చెప్పాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు మధ్యప్రదేశ్  పోలీసులను సంప్రదించగా జూలై 11న ఆ బాలుడు అపహరణకు గురైనట్లు సమాచారం. బాలుడి కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ పోలీసుల బృందంతో కలిసి ముంబైకి చేరుకుని ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. మధ్యప్రదేశ్ స్థానిక పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios