Asianet News TeluguAsianet News Telugu

‘ఎంఏ ఇంగ్లీష్ చాయ్’.. ఉద్యోగం రాకపోవడంతో సొంత వ్యాపారం.. టీ స్టాల్ పెట్టిన ఎంఏ విద్యార్థిని

అనుకున్న ఉద్యోగం రాలేదని కొందరు నిరాశ పడటం, మనస్తాపం చెందుతుంటే మరికొందరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే దారి ఎంచుకుంటుంటారు. కోల్‌కతాకు చెందిన టుక్‌టుకి దాస్ కూడా ఉద్యోగం రాలేదని బాధపడకుండా సొంతంగా టీ స్టాల్ ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు.
 

MA Student started tea stall after not getting job in kolkata
Author
Kolkata, First Published Nov 6, 2021, 1:44 PM IST

కోల్‌కతా: ఎంతో కష్టపడి చదివినా కొన్ని సార్లు అనుకున్న లక్ష్యాలు అందకపోవచ్చు. కొందరు తమకు ఇష్టమైన ప్రవృత్తిని వృత్తిగా మార్చుకుంటారు. ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం, మరికొందరు ప్రొఫెషనల్ దారులు ఎంచుకుంటారు. మరికొందరు తల్లిదండ్రుల కలలు నిజం చేసే పనిలో పడుతారు. కానీ, అన్నిసార్లు అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించకపోతే మరో అనువైన టార్గెట్ నిర్దేశించుకుని వాటిని ఛేదించి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు. అలాంటి వారి జాబితాలోనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన టుక్‌టుకి దాస్ చేరుతారు.

కష్టపడి చదివితే ఆకాశాన్ని అందుకోవచ్చని టుక్‌టుకి దాస్‌కు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెబుతూ వచ్చారు. అలాగే చదివించారు కూడా. Tuktuki Das కూడా కష్టపడి MA English చదివారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో పోటీ పరీక్షలు రాసింది. కానీ, కాలం కలిసిరాలేదు. ఆమెకు Job రాలేదు. ఈ నిరాశ నిస్పృహల్లోనే కుంగిపోకుండా ఆమె Chai అమ్ముకోవాలనే కొత్త నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడువుగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా రైల్వే స్టేషన్‌లో Tea Stall ప్రారంభించింది. దానికి ‘ఎంఏ ఇంగ్లీష్ చాయ్‌వాలి’ అనే పేరు పెట్టింది.

టుక్‌టుకి దాస్ తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లి ఓ చిన్న కిరాణ షాప్ నడుపుతున్నారు. కష్టపడి చదివించిన తమ కూతురు టీ స్టాల్ పెట్టుకోవాలని భావించడంపై వారు తొలుత అసంతృప్తి వ్యక్తపరిచారు. టీ స్టాల్ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా సూచించారు. టీ స్టాల్ పెట్టడానికి టుక్‌టుకి దాస్ కూడా తటపటాయించారు. కానీ, తాను నిరాశలో కూరుకుపోవద్దని బలంగా అనుకున్న తర్వాతే టీ స్టాల్ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే వెనుకడుగు వేయలేదు. తన శాయశక్తులు టీ స్టాల్ నడిపించడానికి ఒడ్డింది. ఇందులో సక్సెస్ అయింది.
ఇప్పుడు హబ్రా స్టేషన్‌లో ఎంఏ ఇంగ్లీష్ చాయ్‌వాలి టీ స్టాల్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.

Also Read: అమెరికాలో ఉద్యోగం వదిలేసి.. యూపీఎస్సీ ఎంచుకొని.. ఐఏఎస్ సాధించాడు..!

టుక్‌టుకి దాస్ తన నిర్ణయం గురించి మాట్లాడింది. ఎంబీఏ చాయ్‌వాలా స్టోరీని ఆమె ఇంటర్నెట్‌లో చదివి ఇన్‌స్పైర్ అయ్యారని వివరించింది. ఏ పని చిన్నది కాదు.. ‘ఎంబీఏ చాయ్‌వాలా’ స్టోరీ నన్ను ఇన్‌స్పైర్ చేసింది అని ఆమె తెలిపింది. తొలుత ఇక్కడ గుర్తింపు లభించడం కష్టతరమైందని, కానీ, ఇప్పుడు తన చాయ్‌కు ప్రత్యేక డిమాండ్ ఉన్నదని వివరించింది. ఇప్పుడు తాను టీ, స్నాక్స్ రెండూ అమ్ముతున్నట్టు తెలిపింది. తాను ఎంఏ డిగ్రీ పట్టా కలిగి ఉన్నందున తన షాప్‌ పేరు ఎంఏ ఇంగ్లీష్ చాయ్‌వాలి అనే పేరు పెట్టినట్టు చెప్పింది.

టుక్‌టుకి దాస్ నిర్ణయంపై తొలుత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తండ్రి ప్రశాంతో దాస్ వివరించారు. కానీ, ఆమె సొంత కాళ్లపై నిలబడటానికి ప్రయత్నం చేయడం తనను మెప్పించిందని, టుక్‌టుకి షాప్ వద్దకు వచ్చిన వారు సంతోషంతో వెనుదిరుగుతుంటారని చెప్పారు. సొంత కాళ్లపై నిల్చోవడం సరైన నిర్ణయమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నట్టు వివరించారు.

Also Read: డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు.. వర్క్ ఫ్రమ్ హోం ఛాన్స్‌.. ఏడాదికి 4 లక్షల వరకూ జీతం

గొప్ప చదువులు చదివి ఇలా చాయ్ అమ్ముకునే దారి ఎంచుకోవడం ఇదే తొలిసారి కాదు. కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)కు మూడేళ్లు కష్టపడి రాసి విఫలైమన మధ్యప్రదేశ్‌లోని లబ్రావ్డా గ్రామస్తుడు ప్రఫుల్ బిల్లోర్ కూడా ఇదే దారి ఎంచుకున్నాడు. తాను వ్యాపారవేత్త కావాలనే నిర్ణయానికి టీ స్టాల్‌లో బీజం వేశాడు. ఇప్పుడు ఆయన బిలియనీర్‌గా ఎదిగాడు. దేశవ్యాప్తంగా 22 ఔట్‌లెట్లు ప్రారంభించాడు. అంతేకాదు, త్వరలోనే విదేశాల్లోనూ ఔట్‌లెట్లు ప్రారంభించే యోచనలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios