Asianet News TeluguAsianet News Telugu

దిమ్మదిరిగే రేంజ్‌లో మహారాజ ఎక్స్‌ప్రెస్.. ట్రైన్ టికెట్ ధర రూ. 19 లక్షలు.. వైరల్ వీడియో ఇదే

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ వీడియో.. ట్రైన్ ప్రయాణం చీప్ అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తుంది. ఖరీదైన ధరకు విలాసవంతమైన సౌకర్యాలను వివరించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ నాలుగు రూట్‌లలో సేవలు అందిస్తున్నట్టు అధికారిక వెబ్ ‌సైట్ తెలుపుతున్నది.
 

luxurious maharajas express ticket cost rs 19 lakh
Author
First Published Dec 17, 2022, 5:31 PM IST

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ట్రైన్‌లో ప్రయాణించే ఉంటారు. సామాన్య పౌరులకు ఇదే రథం వంటిది. చౌక ప్రయాణంతో పేదలు ఎందరో ఈ ట్రైన్‌లనే ప్రధానంగా తమ ప్రయాణాలకు ఎంచుకుంటారు. దూర ప్రయాణాలకు ఇప్పటికీ చాలా మంది రైలు ప్రయాణాలకే పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే.. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే చౌకైనది. అయితే, ఈ అభిప్రాయాన్ని ఓ రైల్వే వీడియో తప్పుగా తేలుస్తున్నది. అదే మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ వీడియో.

ఈ వీడియోలో ఓ వ్యక్తి లోపటి అరలను, ఇతర విలాసవంతమైన సౌకర్యాలను వెల్లడించారు. పలు మార్గాల్లో ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్ సేవలను అందిస్తున్నది. ఈ మహారాజ ఎక్స్‌ప్రెస్ అద్భుతమైన అనుభవాన్ని అతిథులకు అందిస్తుందని అధికారిక మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రత్యేకమైన ఈ ట్రైన్‌లో అతిథులకు ప్రత్యేక సర్వీస్ పర్సన్లు ఉంటారని వివరించింది. మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్ సేవలు అందిస్తున్నాయని తెలిపింది. ఈ అనుభవం తప్పకుండా ప్రయాణించినవారికి నచ్చుతుందని పేర్కొంది.

ఈ ట్రైన్ నాలుగు రూట్లలో ప్రయాణిస్తుంది. ఏడు రోజులపాటు ప్రయాణం ఉంటుంది. ది ఇండియన్ పనోరమా, ట్రెజర్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ స్ప్లెండర్, ది హెరిటేజ్ ఆఫ్ ఇండియాల్లో ప్రయాణించవచ్చు అని అధికారిక వెబ్ సైట్ తెలిపింది.

Also Read: వంటిల్లు తెలంగాణలో.. బెడ్రూం మహారాష్ట్రలో.. ఓ ఇంటి వింత కథ.. రెండు రాష్ట్రాల్లోనూ పన్నులు, పథకాలు...

ఈ ట్రైన్‌లోని విలాసవంతమైన సౌకర్యాలను వెల్లడించే వీడియోను.. ప్రెసిడెన్షియల్ సూట్‌ను వివరిస్తూ ఓ వీడియోను కుషాగ్రా అనే ఇన్‌స్టా యూజర్ పోరస్టు చేశాడు. ఈ వీడియో మొదట్లో ఓ వ్యక్తి మహారాజ ఎక్స్‌ప్రెస్ సూట్ రూడ్ డోర్ తెరుస్తారు. అనంతరం, ఆ సూట్ మొత్తం టూర్ వేస్తారు. ఇందులో ప్రయాణించడానికి రూ. 19 లక్షలకు మించే ఖర్చు అవుతుందని ఆ బ్లాగర్ వివరించాడు.

నవంబర్ 10వ తేదీన పోస్టు చేసిన ఈ వీడియోకు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై యూజర్లు భిన్నమైన కామెంట్లు చేశారు. ఈ ధరకు తాను ప్రాపర్టీ కొనుక్కుంటానని ఒకరు కామెంట్ చేశారు. ఈ అమౌంట్‌లో నేను న్యూయార్క్ సిటీ లేదా ఇతర ఏ దేశాన్ని అయినా సందర్శించి తిరిగి రాగలను అని, అయినా, ఇంకా డబ్బు మిగులుతుందని పేర్కొన్నారు. మరొకరు వ్యంగ్యంగా ఇది  చాలా చీప్. ఎప్పుడూ ఒకే దగ్గర ఉండే ల్యాండ్ కొనుగోలు చేయడానికి బదులు ఇలా కదిలే 1 బీహెచ్‌కే కొనుగోలు చేయడం బెస్ట్ అంటూ పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios