Asianet News TeluguAsianet News Telugu

భర్త డబ్బులతో విదేశాల్లో చదువు: మొగుడికే షాకిచ్చిన భార్య, ఆ భర్త ఏం చేశాడంటే?


పెళ్లైన తర్వాత ఓ యువతి తన  భర్తకు షాకిచ్చింది.  అస్ట్రేలియాకు వెళ్లేందుకు భర్తకు వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధిత కుటుంబం భార్య కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 

Ludhiana woman sent abroad for spouse visa disowns husband
Author
New Delhi, First Published Oct 15, 2021, 11:01 AM IST

లూథియానా: పెళ్లైన తర్వాత ఓ యువతి భర్తకు షాకిచ్చింది. పెళ్లికి ముందు చేసుకొన్న ఒప్పందాలను తుంగలో తొక్కింది. భర్తకు Visa స్పాన్సర్‌షిప్ ను వెనక్కి తీసుకొంది. దీంతో తాము మోసపోయామని గుర్తించిన  భర్త కుటుంబం ఆమెపై కేసు పెట్టింది.

Punjab కు చెందిన ఓ యువతి తన భర్తకు భారీ షాకిచ్చింది. Australiaకు వెళ్లాక వీసాకు స్పాన్సర్ చేస్తానని మాటిచ్చింది. పెళ్లైన తర్వాత ఈ హామీని అమలు చేయలేదు. కేవలం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకే తనతో వివాహానికి ఒప్పుకుందని అర్థమైన భర్త చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

also read:వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

పంజాబ్ రాష్ట్రంలోని బటాలా నగరానికి చెందిన Issaకు 2020 ఫిబ్రవరిలో Akashdeep తో వివాహం జరిగింది. అయితే ఇస్సాకు విదేశాల్లో చదవాలని కోరిక.  విదేశాల్లో చదువుకునేందుకు అయ్యే ఖర్చంతా ఆకాశ్ కుటుంబం భరించాలని పెళ్లికి మునుపు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇస్సా అక్కడకు వెళ్లాక భర్త ఆకాశ్‌దీప్‌కు కూడా వీసా స్పాస్సర్ చేయాలి. ఈ క్రమంలో ఆకాశ్‌దీప్ కుటుంబం కోడలి విదేశీ చదువు కోసం రూ. 14 లక్షలు ఖర్చు చేసింది. 

తొలుత భర్తకు వీసా స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన ఇస్సా  ఆ తర్వాత భర్తతో గొడవ పడింది. దీంతో ఆకాష్ దీప్ వీసా అప్లికేషన్ ఉపసంహరించుకునేలా చేసింది.దీంతో ఇస్సా తన స్పాన్సర్‌షిప్‌ను వెనక్కు తీసుకుంది.ఈ పరిణామంతో తాము మోసపోయామని నిర్ధారించుకున్న ఆకాశ్‌దీప్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇస్సా, ఆమె తండ్రిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios