వైరల్ (వీడియో)

స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి గాయాలు కాకుండానే సురక్షితంగా బయటపెట్టాడు. ఓ వ్యక్తి ముందుగా వెళ్తున్న మినీవ్యాన్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఎదురుగా ఓ బస్సు వేగంగా వస్తుంది. చాకచక్యంగా వ్యవహరించి తన స్కూటర్‌ను ఒకవైపు వంచి దాన్ని వదిలిపెట్టాడు. దీంతో అతడు బస్సు, మినీ వ్యాన్‌కు మధ్యలో నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. బస్సు ముందు భాగంలో ద్విచక్రవాహనం చిక్కుకోగా.. అతడు మాత్రం బస్సుకు కుడివైపుగా పడిపోయాడు.ఎలాంటి వాహనాలు రాకపోవడంతో మరో ప్రమాదం జరగకుండా అందరూ క్షేమంగా బయటపడ్డారు.