న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎస్పీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోనే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లోక్‌సభ తీర్మానం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

లోక్‌సభలో ఎస్పీ నేత అజం ఖాన్ చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా పలువురు  అజం ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.పలు పార్టీలకు చెందిన మహిళ ఎంపీలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా నేతపై అలాంటి వ్యాఖ్యలు చేసిఉండాల్సింది కాదని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆజం ఖాన్‌ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని..ఈ తరహా భాష ఆమోదం యోగ్యం కాదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన ఉదంతంపై ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడటం కాదని, ఆజం ఖాన్‌పై తీవ్ర చర్యల కోసం తాము లోక్‌సభ స్పీకర్‌ వైపు చూస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

మహిళా ఎంపీపై అసభ్య వ్యాఖ్యలు: ఆజంఖాన్ తల నరకమన్న బీజేపీ నేత