సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తల నరకాలంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎంపీ రమాదేవిపై ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన యూపీ బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఆఫ్తాబ్ అద్వానీ ఆయనపై మండిపడ్డారు.

మహిళా ఎంపీ అని కూడా చూడకుండా అవమాన పరుస్తూ వ్యాఖ్యానించిన ఆజంఖాన్‌ తల  నరికి పార్లమెంట్ తలుపులకు వ్రేలాడదీయాలని అద్వానీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆజంఖాన్ మొదట సినీనటి జయప్రదపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ మరో మహిళా ఎంపీని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... ఈ ముసలాయన పిచ్చోడయ్యాడు... పిచ్చి కుక్కలా అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నందున ఇలాంటి వారు దేశానికి ప్రమాదకరం.. అందుకే ఆయన్ని చంపాలంటూ అద్వానీ వీడియో సందేశంలో కోరారు.