Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించుకుందామంటే మాట వినడం లేదని.. బ్లేడ్ తో యువతి గొంతుకోసి.. దారుణం..

జిల్లాలోని మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బితోడ కలాన్ గ్రామానికి చెందిన అక్క తమ్ముడు ఇద్దరూ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అదే పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ యువకుడు ఆ యువతిపై మనసు  పారేసుకున్నాడు.  

lover slit the girl throat over not responding his love proposal in rajasthan
Author
Hyderabad, First Published Nov 24, 2021, 3:12 PM IST

రాజస్థాన్ : తాను ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసింది అని కోపం పెంచుకున్నాడు ఓ కిరాతకుడు. కాలేజీ లంచ్ టైంలో ఎవరూ లేని సమయంలో అదను చూసి దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన Rajasthanలోని పాలీ జిల్లాలో జరిగింది.  పోలీసుల కథనం మేరకు…

జిల్లాలోని మార్వార్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బితోడ కలాన్ గ్రామానికి చెందిన అక్క తమ్ముడు ఇద్దరూ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అదే పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ యువకుడు ఆ యువతిపై మనసు  పారేసుకున్నాడు.  

అయితే, అతనిది One Sided Love. ‘ఇద్దరిదీ ఒకటే కులం, మనం ప్రేమించుకోవడంలో తప్పులేదు’ అని ఆ యువతితో పదేపదే అనేవాడు. కానీ ఆ యువతి అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకునేది. అయితే యువకుడు వదిలిపెట్టలేదు. రోజూ harrassment చేసేవాడు.

ఒకరోజు ప్రియుడి వేధింపులు తాళలేక సోదరుడికి విషయం చెప్పింది. అతడు కూడా సీనియర్ విద్యార్థికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు.  కానీ ఆ ప్రియుడు మారలేదు. నాలుగు రోజులుగా  బ్రతిమిలాడుతున్నా ఆమె కనీసం అతడివైపు  చూడకపోయేసరికి Anger పెంచుకున్నాడు.

మరో వివాదంలో కంగనా.. ఎఫ్ఐఆర్‌ దాఖలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ పిక్‌తో ‘నా మూడ్’ ఇలా ఉందంటూ పోస్టు

మంగళవారం మధ్యాహ్నం Lunch timeలో ఆ యువతి ఒంటరిగా ఉండడం గమనించాడు. అంతే.. నీతో మాట్లాడాలి అంటూ ఆమె దగ్గరికి వెళ్లి  Blade తీసుకుని అతికిరాతకంగా గొంతుకోశాడు.  గొంతు నుంచి భారీగా Bleeding కావడంతో  ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విని విద్యార్థులతో పాటు టీచర్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  చికిత్స కోసం వెంటనే పాలీ లోని  బంగార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఆస్పత్రికి వచ్చారు.  కూతురిని చూసి తల్లిదండ్రులు  బోరున విలపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా  ఆస్పత్రికి వచ్చారు.  తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పారిపోయిన నిందితుడి  కోసం గాలించగా అతను పట్టుబడ్డాడు.

డీజే సౌండ్‌‌కు 63 కోళ్లు మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పౌల్ట్రీ ఫామ్ ఓనర్

పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.  ప్రస్తుతం యువతికి ప్రాణాపాయం తప్పిందని, ఆహారం తీసుకోవడం కష్టం కాబట్టి గ్లూకోజ్ ఎక్కిస్తున్నామని  బంగార్ ఆసుపత్రిలోని ట్రామా వార్డుకు చెందిన డాక్టర్ తెలిపారు.  యువతి అదృష్టం బాగుండి  Esophagus  తెగిపోలేదని,  ఒకవేళ నిందితుడి చేతిలో  ఆహార వాహిక తెగిపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు.  మొత్తం 20 కుట్లు వేశామని,  ప్రస్తుతం ఆమెను ట్రామా వార్డు నుంచి సర్జికల్ వార్డుకు తరలించామని చెప్పారు.  కుట్లు  ఎక్కువగా పడడంతో  ప్రస్తుతం  ఆ యువతి  మాట్లాడలేదని  చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios