తన ప్రియురాలు తనను వదిలేసి భర్త దగ్గరకు వెళ్లడాన్ని తట్టుకోలేకపోయిన ఓ ప్రియుడు ఆమెభర్తను చంపి.. ప్రియురాలి ముక్కును నరికాడు.. రాజస్థాన్‌లో సంచలనం కలిగించిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. బర్మెర్ జిల్లా నాగాన పోలీస్ స్టేషన్ పరిధిలోని చీతర్ కా పార్‌ గ్రామంలో జోగారామ్ అనే యువకుడు అన్సుదేవి అనే వివాహితతో కలిసి నివసిస్తున్నాడు.. ఈమెకు మూడేళ్ల క్రితమే కృష్ణరామ్ అనే వ్యక్తితో వివాహమైంది.

మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అన్సుదేవి.. జోగారామ్‌తో వుంటుంది.. అయితే ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్లిపోయింది.. దీనిని ఏమాత్రం జీర్ణించుకోలని జోగారామ్ ‌ఇద్దరిపై పదునైన కత్తితో దాడి చేశాడు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అన్సుదేవి ముక్కును నరికాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణరామ్ అక్కడికక్కడే మరణించగా.. దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని జోగారామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.