Asianet News TeluguAsianet News Telugu

‘‘ప్రేమ‌ లేఖ‌లు వ‌చ్చాయి’’ - ఆదాయ‌పు పన్ను శాఖ ప‌న్ను నోటీసుపై శ‌ర‌ద్ ప‌వార్ సెటైర్

మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాడే శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీ నోటీసులు అందాయి. అయితే ఆ నోటీసులను ఆయన లవ్ లెటర్స్ అని పేర్కొన్నారు. పరోక్షంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిందించారు. 

Love Letters Received - Sharad Pawar Satire on Income Tax Department Tax Notice
Author
New Delhi, First Published Jul 1, 2022, 1:50 PM IST

ఎంవీఏ ప్ర‌భుత్వం కూలిపోయి, మ‌హారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నుంచి నోటీసులు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆయన గురువారం ధృవీక‌రించారు. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించి తనకు ఈ నోటీసులు అందాయ‌ని శ‌రద్ ప‌వార్ ట్వీట్ చేశారు. ఈ నోటీసుల‌ను ఆయ‌న ప్రేమ‌లేఖ‌లుగా అభివర్ణించారు

భారత్ కుప్పకూలిపోయే ముప్పు ఉన్నది.. ఐక్యంగా ఉండాలి: నోబెల్ గ్రహీత అమర్త్యసేన్

‘‘ నేను 2004, 2009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌కు సంబంధించి ఆదాయపు పన్ను నుండి నాకు ప్రేమలేఖలు అందాయి.’’ అని పవార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన తన మరో ట్వీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ ఏజెన్సీలను కొంత మంది సమాచారాన్ని సేకరించేందుకు ఉప‌యోగిస్తున్నారు. దాని ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. ఇలాగే త‌మ‌కు కూడా విచార‌ణ కోసం నోటీసులు అందాయ‌ని ప‌లువురు శాస‌న స‌భ్యులు చెప్పార‌ని తెలిపారు.

‘‘ ఈ విభాగాల సామర్థ్యంలో గుణాత్మక పెరుగుదల ఉంది. చాలా సంవత్సరాలుగా నిర్దిష్ట వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరించడంపై దృష్టి పెట్టడం ఒక వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది ’’ అని ఆయ‌న మ‌రాఠీలో ట్వీట్ చేశారు. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత బీజేపీ నాయ‌కుడు దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషంగా కనిపించడం లేదని శరద్ పవార్ అన్నారు. ‘‘ ఫడ్నవిస్ రెండో స్థానాన్ని సంతోషంగా అంగీకరించలేదని నేను భావిస్తున్నాను. అతని ముఖకవళికలు అన్నీ చెప్పాయి ’’ అని పవార్ పూణేలో నిన్న మీడియాతో అన్నారు. 

ఉద్ద‌వ్ ఠాక్రే శివ‌సేన ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదని, కేవ‌లం ఎన్సీపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌కే అపాయింట్ మెంట్ ఇచ్చేవార‌ని షిండే వ‌ర్గం చేసిన వాద‌న‌ల‌ను శ‌ర‌ద్ ప‌వార్ ఖండించారు. వాటిని నిరాధార‌మైన‌వని అన్నారు. ‘‘ ఆ ఆరోప‌ణ‌ల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఈ తిరుబాటు ఎన్సీపీ, కాంగ్రెస్ అస్స‌లు కార‌ణం కాదు.  ప్ర‌జ‌ల‌కు ఏదో ఒకటి చెప్పాలి (సాకుగా) క‌దా.. అందుకే ఎన్సీపీ, కాంగ్రెస్ ల‌ను నిందిస్తున్నారు ’’ అని అన్నారు. 

విద్యార్థుల తల్లులకు అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు.. కీచక టీచర్ సస్పెండ్...

కాగా.. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే ఆధ్వ‌ర్యంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీపై తిరుబాటు చేశారు. మొద‌ట గుజరాత్ లోని అహ్మాదాబాద్ కి వెళ్లి ఓ హాటల్ లో ఉన్నారు. త‌రువాత అస్సాంలోని గౌహ‌తిలో ఉన్న ఓ విలాస‌వంత‌మైన రిసార్ట్ కు మ‌కాం మార్చారు. త‌రువాత మ‌హారాష్ట్రలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరిగాయి. ఎట్ట‌కేల‌కు గురువారం సాయంత్రం ఓ కొలిక్కి వ‌చ్చాయి. అంత‌కు ముందు రోజే సీఎంగా ఉన్న ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌దవికి రాజీనామా చేశారు. దీంతో గురువారం సాయంత్ర ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రేపు అసెంబ్లీలో ఆయ‌న బ‌లం నిరూపించుకోనున్న‌ట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios