ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన లవ్ జిహాద్ కేసులో నిందితుడు షంషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి ఓ పిస్టల్, లైవ్ బుల్లెట్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తల్లీ కూతుళ్లను దారుణంగా హతమార్చి మీరట్‌లోని వారి ఇంట్లో పాతిపెట్టిన కేసులో షంషద్ నిందితుడు. వివరాల్లోకి వెళితే.. షంషద్ తన పేరును అమిత్‌గా మార్చుకుని హిందూ యువకుడిగా నమ్మబలుకుతూ ప్రియ అనే యువతితో సహజీవనం చేశాడు.

Also Read: లవ్ జిహాదీ: తల్లీకూతుళ్లను చంపి ఇంట్లో పాతిపెట్టిన ప్రియుడు

అనంతరం ఆమెను వివాహం చేసుకుని, ఐదేళ్లుగా ప్రియతో కాపురం చేస్తున్నాడు. అయితే షంషద్ గుట్టు తెలుసుకున్న ప్రియ అతనితో పలుమార్లు ఘర్షణకు దిగింది. ఈ నేపథ్యంలో షంషద్, ప్రియల మధ్య మార్చి 28న పెద్ద గొడవ జరిగింది.

ఈ సమయంలో ప్రియ ఆమె కుమార్తె కశిష్‌లను అతడు దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలను వారి ఇంట్లోనే పాతిపెట్టాడు. అయితే మూడు నెలలుగా ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జంట హత్య కేసులో షంషద్‌ను ప్రశ్నించిన పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్తుండగా నిందితుడు పారిపోయాడు. దీంతో అతనిపై పోలీస్ శాఖ 25 వేల రివార్డు ప్రకటించింది. కాగా, ఇదే కేసులో నిందితురాలిగా వున్న షంషద్ మొదటి భార్యను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.