మీరట్: ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో లవ్ జిహాదీ హత్య జరిగింది. మహిళ ప్రియుడు తల్లీకూతుళ్లను చంపి శవాలను ఇంట్లో పాతిపెట్టాడు. స్థానిక పోలీసులకు మహిళ ఫ్రెండ్ చంచల్ ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ కనిపించడం లేదంటూ చంచల్ ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా చంచల్ తో ఆ మహిళ కాంటాక్ట్ లోకి రాలేదు. జాతీయ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తాకథనం ప్రచురితమైంది.

ఈ కేసులో షంషాద్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. షంషాద్ తన పేరును మార్చుకుని, తన మతాన్ని దాచిపెట్టి మహిళను పెళ్లి చేసుకున్న కేసులో కూడా నిందితుడు. షంషాద్ తన పేరును మార్చుకుని హిందువుగా చెప్పుకుని ప్రియ, ఆమె కూతురు కాశిష్ తో ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. 

షంషాద్ ముస్లిం అనే విషయాన్ని గుర్తించిన మహిళ అతనికి దూరంగా జరుగుతూ వచ్చింది. మార్చి 28వ తేదీన షంషాద్ తల్లినీ కూతురినీ హత్య చేశాడు. శవాలను ఇంటి ఆవరణలో పాతిపెట్టాడు. 

షంషాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. ఇంటి ఆవరణలో రెండు ఎముకల గూళ్లు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో షంషాద్ పరారయ్యాడు. అతనికి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి పోలీసులు 25 వేల నగదు బహుమతి కూడా ప్రకటించినట్లు జీ న్యూస్ వార్తాకథన తెలిపింది.. 

షంషాద్ మొదటి భార్యను కూడా కేసులో నిందితురాలిగా చేర్చారు. ఆమె ఆచూకీ కూడా దొరకడం లేదు. షంషాద్ బీహార్ కు చెందినవాడని, గత పదేళ్లుగా మీరట్ లో నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.