ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నిండు గర్భిణీకి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. చనిపోతూనే శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యంగా ఉంది. 

ఉత్తరప్రదేశ్ : ఆమె 8 నెలల pregnant. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటూ పుట్టింటికి పయనమైంది. ఎన్నో ఆశలతో సంతోషంగా భర్తతో బైక్ మీద వెడుతోంది. కాసేపట్లో పుట్టింటికి చేరింది. కానీ వారి ప్రయాణం మృత్యువు ఒడికి చేరుకుంది. ఊహించని అతిథిలా మృత్యువు పలకరించింది. వేగంగా వస్తున్న లారీ గర్భిణీ ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. లారీ ఢీ కొన్న సమయంలోనే శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారి ముఖం అయినా చూడకుండానే... పంటి బిగువున బాధను భరిస్తూ అంతలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఉత్తరప్రదేశ్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

ప్రమాదవశాత్తు లారీ కింద పడిన నిండు గర్భిణీ ప్రసరిస్తూనే మృతి చెందింది. ఆగ్రాకు చెందిన కామిని ఎనిమిది నెలల గర్భవతి. కాన్పు కోసం భర్తతో కలిసి బైక్పై పుట్టింటికి వెడుతుంది. ఫిరోజాబాద్ జిల్లాలో భరత్ అనే గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బైక్ అదుపుతప్పింది. బైక్ కి బ్రేక్ వేయడంతో వాహనంపై కూర్చున్న కామిని కింద పడింది. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ ఆమె మీదినుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కామినికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికక్కడే ఆడ శిశువును ప్రసవిస్తూనే కన్నుమూసింది. 

వెంటనే అప్రమత్తమైన స్థానికులు శిశువును స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. శిశువును పరీక్షించిన వైద్యులు... ప్రమాదం ఏమీ లేదని ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. ఈ ప్రమాదంలో శిశువు తండ్రి సురక్షితంగా బయటపడ్డాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం తరువాత ఆగకుండా వెళ్లిపోయిన లారీని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి.. డ్రైవర్ను అరెస్టు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.

కాలేజీ యూనిఫామ్ లో స్టూడెంట్ల లిప్ లాక్ ఛాలెంజ్.. వైర‌ల్ గా మారిన వీడియో..

ఇదిలా ఉండగా, తన కొడుకు ప్రేమ పెళ్లి జీర్ణించుకోలేని ఓ తల్లి నిండు గర్భిణి అయిన కోడలిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన దారుణ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంగ్డి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన బొడ్డు శంకర్ కు ఇద్దరు కుమార్తెలు. అదే గ్రామానికి చెందిన కురటి పండరి, బొడ్డు శంకర్ పెద్దకుమార్తె కీర్తనలు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం పండరి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వివాహం చేసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి అత్త అంబవ్వ కోడలితో తరచూ గొడవ పడుతూ ఉండేది. 

పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. పంచాయితీలో పెద్దల సూచనల మేరకు కీర్తన, పండరిలను పని కోసం హైదరాబాద్కు పంపించారు.పొలం పనుల కోసం వారం రోజుల క్రితం పండరి, కీర్తనలు అచ్చంపేట కు వచ్చారు. సోమవారం కొడుకుని పొలానికి పంపిన అంబవ్వ ఇంట్లో ఉన్న కోడలు కీర్తనపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బాధితురాలిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె అధిక భాగం కాలడంతో కడుపులో ఉన్న మగ కవలలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్త మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.