Kaali poster row: కాళీమాత‌కు సంబంధించి ఓ వివాదాస్ప‌ద పోస్ట‌ర్ ను రిలీజ్ చేసిన చిత్ర నిర్మాత‌తో పాటు మ‌రో ఇద్ద‌రిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు న‌మోదుచేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

Kaali poster row-UP Police register FIR: కాళీమాత వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చూపించే 'కాళి' అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దేశ‌వ్యాప్తంగా వివాదాస్ప‌దంగా మారిన ఈ పోస్ట‌ర్‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నెటిజ‌న్ల‌తో పాటు సామాన్య ప్ర‌జానీకం సైతం మండిప‌డుతున్నారు. ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన చిత్ర బృందంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు వీరిపై కేసు న‌మోదుచేసిన‌ట్టు స‌మాచారం. 

వివ‌రాల్లోకెళ్తే..ప్రముఖ ఫిల్మ్ మేకర్ లేనా మణిమేకలై రూపొందించిన డాక్యుమెంటరీకి సంబంధించి తాజాగా ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. అయితే, దీనిని పై ప్ర‌జ‌ల నుంచి పెద్దఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. స‌మాజిక మాధ్య‌మాల‌ల్లో చిత్ర బృందంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ట్రోల్ చేయడం మాములుగా లేదు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ట్రెంగ్ కావ‌డం గ‌మాన‌ర్హం. హిందూవులమనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ.. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆ పోస్ట‌ర్ లో కాళీమాత రూపంలో ఓ మ‌హిళ చేతితో త్రిశూలం ప‌ట్టుకుని ఉండ‌టంతో పాటు మ‌రో చేతితో సిగ‌రెట్ ప‌ట్టుకుని తాగుతున్న‌ట్టుగా ఉంది. దీంతో స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. 

వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు కూడా ప‌లువురి నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. దీంతో చిత్ర బృందానికి సంబంధించిన ముగ్గురిపై కేసు న‌మోదుచేశారు. యూపీ పోలీసులు చిత్రనిర్మాత, అసోసియేట్ నిర్మాత, ఎడిటర్ల‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), IT (సవరణ) చట్టం 2008లోని రెండు సెక్షన్ల కింద కేసు న‌మోదుచేశారు. "నేరపూరిత కుట్ర, ప్రార్థనా స్థలంలో నేరం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యం వంటి ఆరోప‌ణ‌ల‌తో ఎఫ్‌ఐఆర్" ను న‌మోదుచేశారు. చిత్రనిర్మాత లీనా మణిమేకలైతో పాటు, డాక్యుమెంటరీ అసోసియేట్ ప్రొడ్యూసర్, ఆశా, ఎడిటర్ శ్రవణ్ ఒనాచన్ గా పేర్కొన్నారు. 

Scroll to load tweet…

రాష్ట్ర రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మదురైలో జన్మించిన, టొరంటోకు చెందిన డైరెక్టర్‌పై హిందూ మనోభావాలను కించపరిచారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా కేసు న‌మోదుచేశారు. కెనడాలో, ఉత్తర అమెరికా దేశంలోని భారత హైకమిషన్ టొరంటోకు చెందిన అగాఖాన్ మ్యూజియం నుండి 'హిందూ దేవుళ్లను అగౌరవపరిచే చిత్రణ'ను తొలగించాలని అధికారులను అభ్యర్థించింది. కాగా, హిందుదేవుళ్లను అవమానిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతుండటంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.