ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. రామరాజ్యానికి సామ్యవాదమే(సమాజ్ వాద్) మార్గం సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుంది’ అని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్నిటా విఫలమైందన్నారు.
లక్నో : ‘శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి రాత్రి నాకు dreamsలోకి వస్తాడు. రామ రాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో నేను governament ఏర్పాటు చేస్తానని చెబుతుంటారు’ అని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం Akhilesh Yadav చెప్పారు. బిజెపికి చెందిన శాసనసభ్యులు Madhuri Verma ఆ పార్టీ నుంచి ఎస్పీలో చేరుతున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.
ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. రామరాజ్యానికి సామ్యవాదమే(సమాజ్ వాద్) మార్గం సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుంది’ అని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్నిటా విఫలమైందన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల సంరక్షకులు అనుచిత పద్ధతుల్లో వారికి పరీక్ష కేంద్రాల్లో సాయపడే రీతిలోనే యూపీలో భాజపా నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం కోసం దండెత్తుతున్నారని విమర్శించారు. సమాజ్ వాదీ అధికారంలోకి వస్తే ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, గత డిసెంబర్ 29న అఖిలేష్ యాదవ్ రథయాత్ర చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలు సమీపించడంతో పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయాయి. ఇక్కడ అధికార బీజేపీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల బరిలో నిలిచి పోరాడనున్నాయి.
బీజేపీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలతో అధికారాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ తాము అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి వల్లెవేస్తున్నది. దీనికితోడు అఖిలేష్ యాదవ్ రథ యాత్రకు కూడా చేశారు. కాంగ్రెస్ కూడా బలంగా ప్రచారం చేస్తున్నది. బీఎస్పీ ప్రచారం పెద్దగా కనిపించడం లేదు.
అయితే, అఖిలేష్ యాదవ్ చేపడుతున్న రథ యాత్రకు విశేష స్పందన వచ్చింది. అత్యాచారం కారణంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉన్నావ్‌లో ఆయన యాత్రకు మంచి ఆదరణ వచ్చింది. పార్టీ కార్యకర్తల నుంచి ఆయనకు చాలా బహుమానాలు వచ్చాయి.
COVID-19: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా.. మరో బీజేపీ నేతకు సైతం..
ఈ బహుమానాల్లో చాలా మందిని ఆకర్షించింది.. హనుమాన్ చిత్రపటం. ఓ వ్యక్తి హనుమాన్ చిత్రపటాన్ని అందిస్తుండగా అఖిలేష్ యాదవ్ తీసుకుంటున్న ఫొటోపై చర్చ జరుగుతున్నది. ఆ చిత్రపటంలో పార్టీ కార్యకర్త పేరుతోపాటు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ కూడా కనిపిస్తున్నది.
మరో ఫొటోలో అఖిలేష్ యాదవ్ గదను పట్టుకుని కార్యకర్తల వైపు చూస్తున్నారు. ఆ వాహనం బాల్కనీ నుంచి ముందుకు వంగి గదను ఎడమ చేతిలో పట్టుకుని ముందుకు వెనక్కి తిప్పారు. రథ యాత్రకు హాజరైన జనాలను ఉత్సాహపరిచారు. మరో చిత్రంలో ఆయనకు ఓ వ్యక్తి అంబేద్కర్ చిన్న ప్రతిమను అందజేశారు.
అఖిలేష్ యాదవ్ సెక్యూలర్ లీడర్‌గా చాలా మందికి తెలుసు. అయితే, ఆ గుర్తింపును ముస్లిం మద్దతుదారుడిగా బీజేపీ ఆరోపణలు చేసింది. అఖిలేష్ యాదవ్ ముస్లిం మద్దతుదారుడని ప్రచారం చేసింది. ఈ ప్రచారం సమాజ్‌వాదీ పార్టీని దెబ్బ తీసింది. తద్వార బీజేపీ సులువుగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. అయితే, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ కూడా హిందూ గుర్తింపును స్పష్టం చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
