డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్సీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత శరద్ వవార్ మనవడు రోహిత్ పవర్ జోస్యం చెప్పారు. కొత్తగా ఈవీఎంల తయారీని ప్రారంభించాలని, రిపేర్లు చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయని, తన వాదనకు ఈ ఆదేశాలు బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు. 

2023 డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మనవడు, ఆ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్ల (ఈవీఎం) మరమ్మతులు, తయారీని ప్రారంభించాలని కొంతమంది మహారాష్ట్ర అధికారులకు ఇటీవల ఆదేశాలు అందాయని అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ రోహిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా విషాదం.. వాహనం లోయలో పడి నలుగురు మృతి.. ఎక్కడంటే ?

‘‘సాధారణంగా లోక్ సభ లేదా రాష్ట్ర ఎన్నికలకు ఐదారు నెలల ముందు ఈవీఎంల తనిఖీ నివేదికలు తీసుకుంటారు. అయితే నాలుగు రోజుల క్రితం కొంతమంది మహారాష్ట్ర అధికారులకు ఈవీఎంల మరమ్మతులు, తయారీని ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి’’ అని అన్నారు. 2023 డిసెంబర్ లోనే లోక్ సభకు ఎన్నికలు జరుగుతాయని చెప్పడానికి ఇది సంకేతమని తెలిపారు. 

Scroll to load tweet…

కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం, మధ్యప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనడం ఇందుకు కారణాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీ, శివసేనలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని రోహిత్ పవార్ అన్నారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ముచ్చటించారు.

బెంగళూరులో మహిళా టెక్కీ హత్య.. హైదరాబాద్ లో నివసించే మాజీ ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

కాగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం నేడు (బుధవారం) ముంబైలో తమ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యింది. ఇదే సమయంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం పార్టీ శాసనసభ్యుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీఫ్ విప్ జితేంద్ర అవద్ మంగళవారం జారీ చేసిన వన్ లైన్ విప్ లో.. జూలై 5న మధ్యాహ్నం ఒంటిగంటకు శరద్ పవార్ సమావేశం జరుగుతుందని, ఎమ్మెల్యేలందరూ హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు.అజిత్ పవార్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో ఆదివారం చేరడంతో ఎన్సీపీలో సీనియర్ నాయకుడైన అవాద్ ను శరద్ పవార్ చీఫ్ విప్ గా నియమించారు.