మే 3 తర్వాత హాట్ స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగింపు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మే 3వ తేదీ తర్వాత హాట్ స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: మే 3వ తేదీ తర్వాత హాట్ స్పాట్స్, రెడ్ జోన్లలో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని ఆయన ప్రకటించారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో చర్చించిన తర్వాతే ప్రధాని తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు.
లాక్ డౌన్ విషయమై మే 2వ తేదీన ప్రధాని మోడీ ప్రకటన చేయనున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలోని 290 జిల్లాల్లో కరోనా ప్రభావం లేదన్నారు.కరోనా విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఉండే అవకాశం ఉందన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకొన్న 290 మంది మత్స్యకారులను బస్సులను ఏపీకి తరలిస్తున్నామన్నారు. ప్రజా రవాణ వ్యవస్థను ఇప్పటికిప్పుడే ప్రారంభిస్తే వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
also read:85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ...
హాట్ స్పాట్స్ లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మౌళిక సదుపాయాలతో పాటు ఇతర అవసరాలు తీరాలంటే ప్రభుత్వ కార్యాలయాలు నడవాల్సిన అవసరం ఉందన్నారు.
జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు వారి కింద స్థాయి అధికారులు విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. 30 శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.