85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు లేవు: కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలోని 25 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది.28 రోజుల్లో 16 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని .ఈ జాబితాలో మరో మూడు జిల్లాలు చేరాయని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని 25 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసు నమోదు కాలేదని కేంద్రం ప్రకటించింది.28 రోజుల్లో 16 రోజుల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదని కేంద్రం తెలిపింది..ఈ జాబితాలో మరో మూడు జిల్లాలు చేరాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని గొండియా, కర్ణాటకలోని దావణగెరె, బీహార్ రాష్ట్రంలోని లఖి, సారాయి జిల్లాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకొన్నట్టుగా కేంద్రం తెలిపింది.
కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ సోమవారం నాడు సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకిన రోగులు కోలుకొంటున్నారని కేంద్రం ప్రకటించింది.
ఈ వైరస్ సోకి కోలుకొన్న రోగుల సంఖ్య 22 శాతంగా ఉందని కేంద్రం ప్రకటించింది. దేశంలో సోమవారం నాడు ఉదయానికి కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 27,892కి చేరుకొందని తెలిపింది.
గత 24 గంటల్లో 1,396 కేసులు నమోదయ్యాయి.389 మంది రోగులు ఈ వైరస్ నుండి కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. 20,895 యాక్టివ్ కేసులని కేంద్రం ప్రకటించింది. దేశంలో 6,184 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నారని కేంద్రం తేల్చి చెప్పింది.
ధాన్యం కొనుగోలు సాధారణ స్థితిలో ఉందని, మార్కెట్లు కూడ పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.రాష్ట్రాల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ కు సంబంధించిన వీడియోలను కేంద్ర ఆరోగ్య శాఖ మీడియా సమావేశంలో వీడియోలను ప్రదర్శించింది.
పుణెలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఏడు రోజులకు చేరుకొందని కేంద్రం తెలిపింది.గ్రీన్ జోన్లకు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని హెచ్చరించిన విషయాన్ని లవ్ అగర్వాల్ గుర్తు చేశారు.
కరోనా నుండి కోలుకొన్న రోగుల నుండి సేకరించిన ప్లాస్మా ద్వారా రోగులకు చికిత్స చేసేందుకు ఉపయోగించనున్నట్టుగా ఆయన చెప్పారు.
also read:లోపాలు, చైనా టెస్టింగ్ కిట్స్ వెనక్కి: కేంద్రం కీలక నిర్ణయం
రైల్వేలు, విమానాశ్రయాలు, సీపోర్టుల్లో లాక్ డౌన్ పాసుల కోసం స్థానిక ప్రభుత్వాలు పాస్ లు జారీ చేస్తాయని కేంద్రం ప్రకటించింది. 58 రూట్లలో 109 పార్శిల్ రైళ్లు పలు సరుకులను సరఫరా చేస్తున్నాయని కేంద్రం తెలిపారు.ప్రతి రోజూ 1.50 కోట్ల మందికి ఎన్‌జీఓలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని కేంద్రం చెప్పింది.