టెక్కీ పెళ్లికి లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఫోన్‌పై అక్షింతలు వేసి కొడుకుకి ఆశీర్వాదం

: లాక్‌డౌన్ తో పెళ్లికి హాజరు కాలేని తల్లిదండ్రులు ఫోన్ లోనే కొడుకు పెళ్లిని చూసి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. లాక్ డౌన్  ప్రభావం దేశ వ్యాప్తంగా పలు పెళ్లిళ్లపై పడింది. 

Live streaming a wedding for parents sake


బెంగుళూరు: లాక్‌డౌన్ తో పెళ్లికి హాజరు కాలేని తల్లిదండ్రులు ఫోన్ లోనే కొడుకు పెళ్లిని చూసి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. లాక్ డౌన్  ప్రభావం దేశ వ్యాప్తంగా పలు పెళ్లిళ్లపై పడింది. కొందరు తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకొన్నారు. మరికొందరు తమ పెళ్లిళ్లను నిర్ణీత ముహుర్తం సమయంలోనే చేసుకొన్నారు. 

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన హోసనగర తాలుకాలోని కొడూరుకు చెందిన లక్ష్మీనారాయణ జాయిస్, జయలక్ష్మి దంపతుల కొడుకు శివచంద్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి బెంగుళూరుకు చెందిన కావ్యశ్రీతో ఈ నెల 13వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఫంక్షన్ హాల్ ను కూడ బుక్ చేసుకొన్నారు.

అయితే ఈ లోపుగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ విషయమై పెళ్లి విషయమై రెండు కుటుంబసభ్యుల మధ్య చర్చ జరిగింది. నిరాడంబరంగా పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల చిన్నారితో 2 వేల కి.మీ. బైక్ పై బాలింత

శివమొగ్గ జిల్లాలో ఉన్న వరుడు శివచంద్ర తల్లిదండ్రులు బెంగుళూరుకు వచ్చే పరిస్థితులు లేవు.దీంతో  ఫోన్ లో పెళ్లి వేడుకలను చూడాలని వరుడి పేరేంట్స్ డిసైడ్ అయ్యారు.

ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారంగానే శివచంద్ర కావ్యశ్రీని వివాహం చేసుకొన్నాడు. ఈ పెళ్లిని ఫోన్ లో వరుడి పేరేంట్స్ చూశారు. వరుడు తాళి కట్టిన సమయంలో ఫోన్ పై అక్షింతలు వేసి వారు తమ ఆశీర్వాదం ఇచ్చారు కొత్త దంపతులకు. ఈ పెళ్లికి హాజరుకాలేని వారందరికీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా  వేడుకను చూసే అవకాశం కల్పించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios