Asianet News TeluguAsianet News Telugu

ఫేస్ బుక్ లో లైవ్.. 230 కిలో మీట‌ర్ల వేగంతో బీఎండ‌బ్ల్యూ కారు డ్రైవ్.. చివ‌రికి యాక్సిడెంట్ కావడంతో..

ఉత్తరప్రదేశ్ లో నాలుగు రోజుల కిందట జరిగిన ఓ ప్రమాాదానికి ముందు తీసుకున్న ఓ వీడియో బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

live on Facebook.. Driving a BMW car at a speed of 230 kmph.. Finally an accident, four people died
Author
First Published Oct 17, 2022, 12:34 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఓ బీఎండబ్ల్యూ కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బీహార్ కు చెందిన వారు. అయితే ఈ ప్ర‌మాదానికి ముందు ఇందులో ఉన్న వారంతా ఫేస్ బుక్ లో లైవ్ ప్ర‌సారం చేశారు. ఈ వీడియో ఇప్పుడు బ‌య‌టకు వ‌చ్చింది. అది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

స్కూల్ బస్సులో 80కేజీల కొండ చిలువ... మేకను మింగి...!

మృతుల్లో 35 ఏళ్ల ఆనంద్ ప్రకాష్ అనే డాక్ట‌ర్ కూడా ఉన్నారు. ఆయ‌న బీహ‌ర్ లోని రోహ్తాస్ లోని ఒక ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలో ప్రొఫెసర్ గా ప‌ని చేస్తున్నారు. ఈ వీడియోలో ఆయ‌న త‌న స్నేహితుల‌తో ఆనందంగా క‌బుర్లు చెబుతూ బీఎండ‌బ్ల్యూ కారులో ప్ర‌యాణిస్తున్నారు. ఆ స‌మ‌యంలో కారు ఒక్క సారిగా వేగం పెరిగింది. కారు వేగం క్ర‌మంగా 60 నుంచి 230 కి పెరిగింది. ఆ స‌మ‌యంలో ఒక‌రు ‘‘చారో మారెంగే’’ (మనం నలుగురం చనిపోతాం) అని అన్నారు. మ‌రొక‌రు త్వ‌ర‌లో స్పీడోమీట‌ర్ 300 కిలో మీట‌ర్లు తాకాల‌ని చెప్పారు. రోడ్డు సూటిగా ఉంద‌ని, సీటు బెల్టు పెట్టుకోవాల‌ని మాట్లాడుకుంటున్నారు. 

గుజరాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే త‌ప్పుడు కేసుల్లో న‌న్ను ఇరికిస్తున్నారు: మనీష్ సిసోడియా

కొంత స‌మ‌యం త‌రువాత ఆ కారు ప్ర‌మాదానికి గురైంది. అజంగఢ్, సుల్తాన్‌పూర్ సమీపంలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆగి ఉన్న కంటైనర్‌ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అయితే ఈ ప్రమాదం వీడియోలో రికార్డు కాలేదు. ఆ కారు ఓ ట్ర‌క్కును ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన డాక్ట‌ర్ ఆనంద్ తండ్రి నిర్మ‌ల్ కుమార్ డెహ్రీ నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు.  డాక్టర్ నిర్మల్ కుమార్ కుష్వాహా కుమారుడు డాక్టర్ ఆనంద్ ప్రకాష్, ఆనంద్ ఓ బంధువు, మ‌రో ఇద్ద‌రు స్నేహితులతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరారు. అదే సమయంలో అతని తండ్రి డాక్టర్ నిర్మల్ కుమార్ నివాసం, క్లినిక్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కాగా.. ఇందులో మృతి చెందిన వారు కూడా ప్ర‌ముఖులే. వారిలో ఒక‌రు ఇంజనీర్ దీపక్ కుమార్ కాగా.. మ‌రొక‌రు రియల్టర్ అఖిలేష్ సింగ్, మరొక‌రు వ్యాపారవేత్త ముఖేష్. 

Follow Us:
Download App:
  • android
  • ios