Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే త‌ప్పుడు కేసుల్లో న‌న్ను ఇరికిస్తున్నారు: మనీష్ సిసోడియా

Delhi liquor scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమ‌వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించ‌డానికి ముందు.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తనను పాల్గొనకుండా అడ్డుకునేందుకు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.

I am being implicated in false cases in the context of Gujarat elections: Manish Sisodia
Author
First Published Oct 17, 2022, 11:46 AM IST

Manish Sisodia: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేసింది. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రితో పాటు ప‌లువురిని ఈ కేసులో విచార‌ణ‌కు పిలిచింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ, ఆప్ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే గుజరాత్ లో ఆప్ అధికార పార్టీ బీజేపీపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో దూకుడుగా ముందుకు సాగుతోంది. అక్క‌డ కూడా బీజేపీ, ఆప్ ల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ హీటెక్కింది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఆప్ నాయ‌కుడు మ‌నీష్ సిసోడియా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు కావాల‌నే త‌న‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించేదుకు కుట్ర చేస్తున్న‌ద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డుకునేందుకు త‌న‌ను జైల్లో పెట్టేందుకు త‌ప్పుడు కేసులు పెడ‌తున్నార‌ని విమ‌ర్శించారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సోమ‌వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించ‌డానికి ముందు.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తనను పాల్గొనకుండా అడ్డుకునేందుకు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అరెస్టు చేయాలని యోచిస్తున్నారని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ ఆదివారం సమన్లు ​​జారీ చేసింది. అక్టోబర్ 16, సోమవారం ఉదయం 11 గంటలకు ఆయనను విచారణకు పిలిచారు. ఒక పార్టీ లేదా వ్యక్తి పేరును పేర్కొనకుండా..  "వారు నాపై పూర్తిగా ఫేక్ కేసు పెట్టి నన్ను అరెస్టు చేయాలని ప్లాన్ చేస్తున్నారు " అని మ‌నీష్ సిసోడియా ఆరోపించారు.

ట్విటర్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.. "నాపై పూర్తిగా ఫేక్ కేసు పెట్టి నన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి ఉంది. ఇంతమంది గుజరాత్‌ను ఘోరంగా కోల్పోతున్నారు. నన్ను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా చేయడమే వారి ఉద్దేశం" అని పేర్కొన్నారు. 

 

మరో ట్వీట్‌లో "నేను గుజరాత్‌కు వెళ్ళినప్పుడు, రాష్ట్రంలో కూడా మీ పిల్లల కోసం ఢిల్లీ వంటి అద్భుతమైన పాఠశాలలను మేము నిర్మిస్తామని గుజరాత్ ప్రజలకు చెప్పాను. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొంత మంది గుజరాత్‌లో మంచి పాఠశాలలు నిర్మించాలని లేదా గుజరాత్ ప్రజలు చదువుకుని అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు అంటూ అక్క‌డి ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 

సోమవారం సీబీఐ విచారణకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాపై పెట్టిన కేసును తప్పుడు కేసుగా అభివ‌ర్ణించారు. “మనీష్ ఇంటిపై దాడిలో ఏమీ కనుగొనబడలేదు. బ్యాంక్ లాకర్‌లో ఏమీ కనుగొనబడలేదు. తమపై పెట్టిన కేసు పూర్తిగా అబద్ధమన్నారు. ఎన్నికల ప్రచారానికి గుజరాత్ వెళ్లాల్సి వచ్చింది. ఆయన్ను అడ్డుకునేందుకు అరెస్టులు చేస్తున్నా ఎన్నికల ప్రచారం మాత్రం ఆగడం లేదు. గుజరాత్‌లోని ప్రతి వ్యక్తి ఈ రోజు ఆప్ కు అండ‌గా ఉంటున్నారు" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios