Asianet News TeluguAsianet News Telugu

Live in Relationship: భాగస్వామి గొంతు కోసిన మహిళ.. ఎందుకంటే?

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తనతో సహజీవనం చేస్తున్న భాగస్వామిని రేజర్‌తో గొంతు కోసి చంపేసింది. భర్తతో వేరు పడ్డ ఆ మహిళ బాధితుడితో సహజీవనం చేసింది. కానీ, ఆయన కూడా పెళ్లికి నిరాకరించి ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తర్వాత గొంతు కోసింది.
 

live in partner throat slit by woman for refusing to marry in uttar pradesh
Author
Lucknow, First Published Aug 9, 2022, 11:15 AM IST

గజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ఓ జంట మధ్య చిచ్చు రేగింది. పెళ్లి చేసుకోవడంపై వాగ్వాదం హెచ్చింది. చివరకు ఆ మహిళ తన భాగస్వామిని రేజర్‌తో గొంతు కోసింది. ఆ తర్వాత డెడ్ బాడీని ఓ ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి తోసుకెళ్లింది. ఆమె వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ప్రీతి శర్మ అనే మహిళ తన భర్తతో నాలుగేళ్ల క్రితం విడిపోయింది. వేరుగా జీవిస్తున్నది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె ఫిరోజ్ అలియాస్ చ్వన్నీ (23) తో కలిసి జీవిస్తున్నది. ఫిరోజ్‌ను ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. ఆ విషయాన్ని ఫిరోజ్‌కు తెలియజేసింది. కానీ, ఫిరోజ్ ఆమె పెళ్లి విషయాన్ని నాన్చుతూ వచ్చాడు. తన తల్లిదండ్రులు వేరే కమ్యూనిటీకి చెందిన మహిళతో పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరని వివరించాడు. తల్లిదండ్రులు కారణంగా చూపుతా పెళ్లిని నిరాకరిస్తూ వచ్చాడు. 

తనను కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని ప్రీతి శర్మ.. ఫిరోజ్‌కు తెగేసి చెప్పింది. కానీ, ఆ ప్రతిపాదనను అంతే బలంగా ఫిరోజ్ వ్యతిరేకించాడు. అక్కడికి పరిమితం కాకుండా.. ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రీతి శర్మను క్యారెక్టర్‌లెస్ అని అన్నాడు. దీంతో ప్రీతి శర్మ తీవ్రంగా కలత చెందింది. ఆ ఆగ్రహంతో ప్రీతి శర్మ ఓ రేజర్ తీసుకుని ఫిరోజ్ శర్మ గొంతు కోసింది. 

ఆ తర్వాత ఓ ట్రాలీ బ్యాగ్‌ను కొనుగోలు చేసింది. ఆ ట్రాలీ బ్యాగ్‌లో ఫిరోజ్ డెడ్ బాడీని కుక్కింది. ఆ డెడ్ బాడీ గల బ్యాగ్‌ను తోసుకుంటూ వెళ్లింది. గజియాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏదో ఒక ట్రైన్‌లో బ్యాగ్‌ను డంప్ చేసి వచ్చేయాలని ఆమె భావించింది. కానీ, ఆమె రైల్వే స్టేషన్ చేరకముందే పోలీసులు ఆమెను అడ్డగించారు. బ్యాగ్‌ను విప్పి చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్‌ను చంపడానికి ఉపయోగించిన రేజర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు మునిరాజ్ జీ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios