స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేసిన దేశాలు ఇవే...
ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ ద్వారా స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. మరో10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి.
ఢిల్లీ : స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరిష్మా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల విచారణ తర్వాత ఈ పిటిషన్లపై మే 11న తీర్పును రిజర్వ్ చేసింది.
మంగళవారం అక్టోబర్ 17న దీనిమీద తీర్పును వెలువరించింది. ప్రత్యేక వివాహచట్టం రాజ్యాంగ విరుద్దం కాదని, శాసనవ్యవస్థలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ సొంతం అని తెలిపింది. ప్రత్యేక వివాహచట్టాన్ని తాము రద్దు చేయలేమని, పార్లమెంటే దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వివాహచట్టం గుర్తింపును వ్యతిరేకిస్తోంది. దీనిని పట్టణ ఉన్నత వర్గాల ఆలోచనగా పేర్కొంటూ పార్లమెంట్ ఈ అంశాన్ని నిర్ణయించి చర్చించాలని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్ తర్వాత స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. అయితే 10 దేశాలు కోర్టు నిర్ణయాల ద్వారా చట్టబద్ధం చేశాయి.
ప్రత్యేక వివాహచట్టం ఉన్న 30 కంటే ఎక్కువ దేశాల జాబితా ఇది..
నెదర్లాండ్స్ : 2001
బెల్జియం : 2003
కెనడా : 2005
స్పెయిన్ : 2005
దక్షిణాఫ్రికా : 2006
నార్వే : 2009
స్వీడన్ : 2009
ఐస్లాండ్ : 2010
పోర్చుగల్ : 2010
అర్జెంటీనా : 2010
డెన్మార్క్ : 2012
ఉరుగ్వే : 2013
న్యూజిలాండ్ : 2013
ఫ్రాన్స్ : 2013
బ్రెజిల్ : 2013
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ : 2014
స్కాట్లాండ్ : 2014
లక్సెంబర్గ్ : 2015
ఐర్లాండ్ : 2015
యునైటెడ్ స్టేట్స్ : 2015
గ్రీన్‌ల్యాండ్ : 2016
కొలంబియా : 2016
ఫిన్లాండ్ : 2017
జర్మనీ : 2017
మాల్టా : 2017
ఆస్ట్రేలియా : 2017
ఆస్ట్రియా : 2019
తైవాన్ : 2019
ఈక్వెడార్ : 2019
ఐర్లాండ్ : 2020
కోస్టా రికా : 2020
స్విట్జర్లాండ్ : 2022
మెక్సికో : 2022
చిలీ : 2022
స్లోవేనియా : 2022
క్యూబా : 2022
అండోరా : 2023
ఎస్టోనియా : 2024
"ప్రపంచంలోని వివాహ సమానత్వం" పేరుతో మానవ హక్కుల ప్రచార నివేదిక నుండి ఈ డేటా సేకరించబడింది. దీని ప్రకారం, చెక్ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ లలో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి.