కరోనా వైరస్ మనుషులపైనే కాదు జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులోని ఓ జూలో కరోనాతో ఒక సింహాం మృతిచెందడం కలకలం రేపుతోంది. అరిగనార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. నీలా అనే 9 సంవత్సరాల ఆడ సింహం కరోనాకు బలైంది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా ఈ జూ మూసివుంది. జూ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. వారిలో ఎవ్వరికీ కరోనా సోకలేదు. మరి సింహాలకు కోవిడ్ ఎలా సోకిందనే విషయం అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

Also Read:నిన్నటితో పోలిస్తే తగ్గిన కరోనా కేసులు, మరణాలు