Asianet News TeluguAsianet News Telugu

లిక్క‌ర్ స్కామ్ తో హైద‌రాబాద్ కు లింకులు.. వాటిని కోర్టులోనే చెబుతాం - ఢిల్లీ బీజేపీ నాయ‌కుడు మజిందర్ సింగ్

ఢిల్లీ స్కామ్ లో హైదరాబాద్ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ బీజేపీ నాయ‌కుడు మజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ఆ వివరాలు అన్నీ తెలంగాణ హైకోర్టుకు వివరిస్తామని ఆయన తెలిపారు. 

Links to Hyderabad with liquor scam...we will tell them in court - Delhi BJP leader Majinder Singh
Author
First Published Sep 16, 2022, 9:56 AM IST

ఢిల్లీలో వెలుగుచూసిన లిక్క‌ర్ స్కామ్ కు హైద‌రాబాద్ తో లింకులు ఉన్నాయ‌ని ఢిల్లీ బీజేపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సింగ్ సిర్సా  ఆరోపించారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయ‌ని చెప్పారు. కాబ‌ట్టి ఈ స్కామ్ కు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను హైకోర్టులోనే వెల్ల‌డిస్తామ‌ని అన్నారు. 

డెలివరీ బాయ్ సాహసం... ఫుడ్ డెలివర్ చేయడానికి ఏం చేశాడంటే...!

ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఆయ‌న ఎంపీ సుధాంశు త్రివేది, ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ ఆదేష్ గుప్తాల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారంలో తెలంగాణ రాజ‌ధాని నుంచి ఎవ‌రు ఢిల్లీకి వ‌చ్చార‌నే వివ‌రాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పారు. అలాగే ఢిల్లీ వారు ఎవ‌రిని క‌లిశార‌నేది కూడా త‌మ‌కు తెలుసు అని పేర్కొన్నారు. దేశ రాజ‌ధాని నుంచి హైద‌రాబాద్ సిటీకి ఎవ‌రు వెళ్లారు ? అక్క‌డ ఎవ‌రిని క‌లిశారనే విష‌యాలు కూడా త‌మ‌కు తెలుసు అని చెప్పారు. వాటికి సంబంధించిన స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. 

ల‌క్నోలో ఘోరం.. భారీ వ‌ర్షం వ‌ల్ల గోడ కూలి 9 మంది మృతి.. ఒకరికి గాయాలు

హైకోర్టు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని చెప్పింద‌ని, అందుకే ఈ స్కామ్ లో ముఖ్య‌మైన వ్య‌క్తుల పాత్ర కూడా తాము బ‌హిర్గతం చేయ‌డం లేద‌ని మజిందర్ సింగ్ సిర్సా అని అన్నారు. ఈ లిక్క‌ర్ స్కామ్ ద్వారా వ‌చ్చిన అవినీతి సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా అసెంబ్లీ ఎల‌క్ష‌న్ లో ఉప‌యోగించుకుంద‌ని ఆరోపించారు. 

అవినీతి క‌నిపించ‌కుండా చేస్తామ‌ని మాట‌లు చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారంలోకి వ‌చ్చార‌ని మజిందర్ సింగ్ సిర్సా అన్నారు. కానీ ఇప్పుడు ఆయ‌న దానికి పూర్తి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. ఢిల్లీ సీఎం త‌న స్నేహితుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించార‌ని ఆరోపించారు. ఆయ‌న ఢిల్లీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios