Lightning: పిడుగుపాటుతో బిల్డింగ్ పైకప్పుకు మంటలు.. ఎగసిపడ్డ అగ్నికీలలు.. స్పాట్‌కు ఫైర్ ఇంజిన్లు
మహారాష్ట్రలో థానే, పాల్ఘర్‌లో నిన్న రాత్రి భీకర వర్షం కురిసింది. ఉరుముులు మెరుపులతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. థానేలో ఆదివారం తెల్లవారుజామున పడిన పిడుగుతో ఓ భవంతికి నిప్పు అంటుకుంది. దానిపైనున్న ప్లాస్టిక్ రూఫ్‌కు నిప్పు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆర్పివేశాయి.
ముంబయి: మహారాష్ట్రలో థానే, పాల్ఘర్ జిల్లాల్లో భీకర వర్షం కురిసింది. వర్షంతోపాటు పిడుగులూ పడ్డాయి. తెల్లవారు జామున భారీ వర్షం కురిసిన తర్వాత పడిని పిడుగుకు ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్ పైకప్పుకు నిప్పు అంటుకుంది. తీవ్ర స్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. చివరకు స్పాట్‌కు ఫైర్ ఇంజిన్లు రావాల్సి వచ్చింది. అగ్నిమాపక యంత్రాలు ఆ మంటలను ఆర్పేశాయి. ఈ ఘటన థానేలో చోటుచేసుకుంది. పాల్ఘర్‌లో వర్షం పడిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఓ వ్యక్తి మరణించాడు.
థానే జిల్లాలోని ఓ భవంతికి పిడుగుపాటు కారణంగా నిప్పు అంటుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. థానేలోని భివండీ పట్టణంలో కల్హర్ ఏరియాలో దుర్గేశ్ పార్క్ సమీపంలో ఈ బిల్డింగ్ ఉన్నది. ఈ బిల్డింగ్ పైన ఉన్న ప్లాస్టిక్ రూఫ్ పిడుగుపాటుకు మండిపోయింది. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఆ ప్లాస్టిక్ రూఫ్‌కు మంట అంటుకున్నదని భీవండి నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ ఆఫీసర్ సాఖిబ్ ఖార్బే తెలిపారు.
Also Read: Dog: కుక్క విశ్వాసం.. అడ్డు రావడంతో యాక్సిడెంట్.. మృతుడి తల్లి చేతిలో తల వాల్చి ఆ కుక్క విచారం
అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేవని ఆయన చెప్పారు. బిల్డింగ్ ప్లాస్టిక్ రూఫ్ మాత్రం డ్యామేజ్ అయిందని తెలిపారు. ఈ ఘటన సమాచారం అందగానే ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు వెళ్లాయని, మంటలు ఆర్పాయని వివరించారు.
పాల్ఘర్‌లోనూ రాత్రిపూట వర్షం ఎక్కువగా పడింది. వర్షం కురిసిన తర్వాత అక్కడ బైక్‌ల యాక్సిడెంట్లు రిపోర్ట్ అయ్యాయి. అలాంటి ఓ బైక్ యాక్సిడెంట్‌లో ఒకరు మరణించారని పాల్ఘర్ జిల్లా రూరల్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు.