లైఫ్ మిషన్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా శివశంకర్, స్వప్న సురేష్ మధ్య మరిన్ని వాట్సప్ చాట్‌లు బయటపడ్డాయి.
తిరువనంతపురం : లైఫ్ మిషన్ కేసులో అరెస్టైన కేరళ సిఎం మాజీ కార్యదర్శి ఎం శివశంకర్, స్వప్న సురేష్ మధ్య మరిన్ని వాట్సప్ చాట్‌లు బయటపడ్డాయి. ఇది సెప్టెంబర్ 2019 వాట్సాప్ చాట్. యూఏఈలోని రెడ్ క్రెసెంట్‌ను లైఫ్ మిషన్ ప్రాజెక్ట్‌లోకి ఎలా తీసుకురావాలనే దానిపై శివశంకర్ సలహా ఇస్తున్నట్టుగా ఈ చాట్ లో తెలుస్తోంది. రెడ్‌క్రెసెంట్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెటర్ రూపురేఖలను కూడా శివశంకర్ స్వయంగా చెప్పారు.
కాన్సులేట్ లేఖతో పాటు ముఖ్యమంత్రికి కూడా లేఖ పంపాలని సూచించారు. ఈ రెండు లేఖలు సిద్ధం చేసి తనకు అందజేయాలని శివశంకర్ కోరారు. అవసరమైతే ముఖ్యమంత్రి అదనపు ప్రయివేటు కార్యదర్శిగా ఉన్న సీఎం రవీంద్రన్‌ను కూడా పిలిపించాలని స్వప్నకు సూచించారు. ఈడీ, సీబీఐ ఈ చాట్‌ను లైఫ్ మిషన్ డీల్‌లో యూఏఈ రెడ్ క్రెసెంట్‌ని ఇన్వాల్వ్ చేయడానికి శివశంకర్ చేసిన ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా చూస్తున్నాయి.
లైఫ్ మిషన్ స్కాం : కేరళ సిఎం మాజీ కార్యదర్శి శివశంకర్ ను అరెస్ట్ చేసిన ఈడీ..
