ప్రతిపక్షాలు ఏకం కావడం చారిత్రాత్మక చర్య అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశం కోసం అందరం కలిసి నిలబడతామని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకం కావడం చారిత్రాత్మక చర్య అని అన్నారు.

ఇవేం ఎండలు బాబోయ్.. భానుడి ప్రతాపానికి అహ్మదాబాద్ లో కరిగిన రోడ్డు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు..ఫొటోలు వైరల్

‘‘ప్రతిపక్షాల విజన్ ను అభివృద్ధి చేసి ముందుకు సాగుతాం. దేశం కోసం అందరం కలిసి నిలబడతాం.’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన చర్య తీసుకున్నామని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సైద్ధాంతిక పోరులో కాంగ్రెస్ అన్ని పార్టీలను తీసుకెళ్తుందని తెలిపారు. 

Scroll to load tweet…

కాగా.. రాహుల్, నితీశ్ లతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్మన్ తేజస్వీ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. వీలైనన్ని ఎక్కువ రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

2024 లోక్ సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడతాం - ఖర్గే
ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఇక్కడ చారిత్రాత్మక సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించాం. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు.