నాపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని వదిలేయండి.. అతడు తప్పు తెలుసుకున్నాడు- ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి

ఇటీవల వైరల్ అయిన వీడియోలో ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే అతడిని వదిలేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు. నిందితుడు తన తప్పు తెలుసుకున్నాడని తెలిపారు. 

Let go of the man who urinated on me.. He realized his mistake- Victim appeals to Govt..ISR

మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుడి ప్రవేష్ శుక్లాగా గుర్తించి అతడిని అరెస్టు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

యూసీసీ తీసుకురావడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సులువు కాదు - గులాం నబీ ఆజాద్

నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అతడు ఏ పార్టీ వాడైన తమకు సంబంధం లేదని తెలిపారు. అనంతరం అతడి ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చేసింది. అయితే ఈ కేసులో తాజాగా బాధితుడు దష్మత్ రావత్ ప్రభుత్వాన్నికి ఓ విన్నపం చేశాడు. తనపై మూత్రం పోసిన ప్రవేష్ శుక్లాను వదిలిపెట్టాలని కోరారు. నిందితులు తప్పు చేశారని, కానీ ఇప్పుడు దానిని తెలుసుకున్నారని అన్నారు. ‘‘గతంలో ఏం జరిగినా ఆయన ఇప్పుడు తన తప్పును గ్రహించారు’’ అని దష్మత్ రావత్ శుక్రవారం మీడియాతో అన్నారు. 

శుక్లా అంత అవమానకరంగా వ్యవహరించినప్పటికీ ప్రభుత్వానికి ఇలాంటి డిమాండ్ ఎందుకు చేస్తున్నారని మీడియా బాధితుడిని ప్రశ్నించినప్పుడు ‘‘అవును. దానిని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఆయన మా గ్రామానికి చెందిన పండిట్. ఆయనను విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’’ అని తెలిపారు. 

పొలంలో ట్రాక్టర్ నడిపి, వరి నాట్లు వేసిన రాహుల్ గాంధీ.. రైతులతో ముచ్చట్లు పెట్టిన కాంగ్రెస్ నేత..

గ్రామంలో రోడ్డు నిర్మాణం మినహా ప్రభుత్వం నుంచి తాను ఏమీ కోరుకోవడం లేదని రావత్ తెలిపారు. అయితే మరి ఆయన విజ్ఞప్తికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. ఈ మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియో గత మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మరుసటి రోజు శుక్లాను పోలీసులు అరెస్టు చేసి, ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనలతో పాటు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు. శుక్లా ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని జైలులో ఉన్నారు.

కాగా.. శుక్లా అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చేశారు. ఈ బుల్డోజర్ చర్య తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం భోపాల్ లోని సిఎం నివాసంలో బాధితుడి ఇంటికి చేరుకున్నారు. అతడి పాదాలను కడిగి, మూత్ర విసర్జన ఘటనపై క్షమాపణలు చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వం తరఫున బాధితుడికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.1.5 లక్షలు అందజేశారు. 

పశ్చిమ బెంగాల్ లో హింస.. పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

అయితే సీఎం కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పడం మాత్రమే సరిపోదని కాంగ్రెస్ పేర్కొంది. ఇదంతా డ్రామా అని అభివర్ణించింది. ఈ ఘటన యావత్ గిరిజన సమాజాన్ని అగౌరవపరచడమేన కేవలం కాళ్లు కడగడం సరిపోదని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ అన్నారు. బీజేపీ విధానాలు గిరిజన వ్యతిరేకమైనవని, పార్టీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా, వీడీ శర్మ (రాష్ట్ర బీజేపీఅధ్యక్షుడు) తో సహా ఆ పార్టీ నాయకులు గిరిజనుల భూములను ఆక్రమించారని ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. నిందితుడి ఇంటిని కూల్చడం పట్ల బ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్లా చర్య శోచనీయమని, అయితే అతడి ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులను శిక్షించడం సరైంది కదాని తెలిపింది. శుక్లా ఇంటిలోని కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios